Fish Medicine: ఇవాళ్టి నుంచి బత్తిని సోదరుల చేపప్రసాదం పంపిణీ.. శాకాహారులకు ప్రత్యేక ఏర్పాట్లు..

|

Jun 09, 2023 | 11:22 AM

Hyederabad: హైదరాబాద్‌లో చేప మందు పంపిణీకి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇవాళ, రేపు పంపిణీ జరగునుంది. రాత్రి నుంచే ప్రసాదం కోసం జనం బారులు తీరారు. చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Fish Medicine: ఇవాళ్టి నుంచి బత్తిని సోదరుల చేపప్రసాదం పంపిణీ.. శాకాహారులకు ప్రత్యేక ఏర్పాట్లు..
Fish Medicine
Follow us on

హైదరాబాద్, జూన్ 09: కరోనా కారణంగా మూడేళ్లుగా ఆగిపోయిన చేపప్రసాదం పంపిణీ ప్రారంభమైంది.  చేపప్రసాదం పంపిణీని ప్రారంభించారు బత్తిన సోదరులు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇవాళ, రేపు చేపప్రసాదం పంచనున్నారు. రాత్రి నుంచే ప్రసాదం కోసం వివిద ప్రాంతాల నుంచి వచ్చిన జనం క్యూలైన్లలో బారులు తీరారు. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉదయం నుంచి చేప మందును పంపిణీ చేస్తారు. అస్తమా, ఉబ్బసం రోగుల ఇబ్బందుల నుంచి ఊరటనిస్తుందని విశ్వసించే బత్తిని బ్రదర్స్‌ చేపమందు పంపిణీకి సర్వం సిద్ధమైంది. మృగశిరకార్తె సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ వేదికగా చేప మందు ప్రసాదం పంపిణీ చేయనున్నారు.

హైదరాబాద్‌లో చేప మందు ప్రసాదం కోసం.. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఆస్తమా రోగులు ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలివచ్చారు.

ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు..

చేపమందు పంపిణీకి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో 34 కౌంటర్లు, 32 క్యూలైన్లు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సరిపడా టాయిలెట్స్‌ ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు, కౌంటర్లు ఉన్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో రెండు రోజుల పంపిణీ తర్వాత పాతబస్తీ దూద్‌బౌలిలోని తమ నివాసంలో బత్తిని కుటుంబం వారం రోజులపాటు చేప ప్రసాదం అందించనుంది. ప్రయాణీకుల కోసం రెండు రోజులపాటు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు అధికారులు. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల నుంచి దాదాపు 50 బస్సులు, తెలంగాణలోని వివిధ ప్రాంతల నుంచి 80 బస్సులు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

శాకాహారులకు మరోలా..

రెండు రోజులపాటు 5లక్షల మందికి సరిపోయేలా 5 క్వింటాళ్ల చేప మందు ప్రసాదం తయారు చేశారు. మత్స్యశాఖ ఇప్పటికే 2.5 లక్షల కొర్రమీను చేప పిల్లలను సిద్ధం చేసింది. శాకాహారులకు బెల్లంతో కలిపి ప్రసాదం ఇస్తారు. చిన్నపిల్లల నుంచి వందేళ్ల వృద్ధుల వరకు చేపమందు ఎవరైనా వేసుకోవచ్చని, గర్భిణులు మాత్రం తీసుకోవద్దని నిర్వాహకులు సూచించారు. పరగడుపున కానీ.. భోజనం తీసుకున్న మూడు గంటల తర్వాత కానీ మందు తీసుకోవాలని చూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం