Police Lathicharge: వివేకానంద ఉత్సవాలు జరపడం దేశ ద్రోహమా..? జనగామ లాఠీచార్జ్‌ ఘటనపై స్పందించిన బండి సంజయ్‌

|

Jan 12, 2021 | 4:36 PM

Police Lathicharge: తెలంగాణలోని జనగామ లాఠీచార్జ్‌ ఘటనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు. జనగామ నగర బీజేపీ అధ్యక్షుడు పవన్‌ శర్మపై...

Police Lathicharge: వివేకానంద ఉత్సవాలు జరపడం దేశ ద్రోహమా..? జనగామ లాఠీచార్జ్‌ ఘటనపై స్పందించిన బండి సంజయ్‌
Bandi Sanjay
Follow us on

Police Lathicharge: తెలంగాణలోని జనగామ లాఠీచార్జ్‌ ఘటనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు. జనగామ నగర బీజేపీ అధ్యక్షుడు పవన్‌ శర్మపై లాఠీచార్జ్‌ అమానుషమన్నారు. పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా పని చేస్తున్నారని మండిపడ్డారు. సీఐ మల్లేష్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. స్వామి వివేకానంద ఉత్సవాలు జరపడం దేశ ద్రోహమా అని సంజయ్‌ ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు.

కాగా, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లను మున్సిపల్‌ సిబ్బంది తొలగించారు. అయితే బ్యానర్ల తొలగించడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. దీంతో స్థానిక సీఐ, పోలీసులు బీజేపీ నగర అధ్యక్షుడు పవన్‌ శర్మ, కార్యకర్తలపై లాఠీచార్జ్‌ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Assets Registration: పాస్‌పోర్ట్‌తో ఆస్తుల రిజిస్ట్రేషన్‌.. అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం