రైల్వే మంత్రితో బండి సంజయ్ భేటీ.. అక్కడ కొత్త రైల్వే లేన్‌ కోసం ప్రతిపాదన.. అశ్వీనీ వైష్ణవ్ ఏమన్నారంటే..?

|

Jul 05, 2023 | 9:21 PM

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ బుధవారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు.  ఈ రోజు న్యూఢిల్లీలోనే ఉన్న బండి సంజయ్.. అశ్వీనీ వైష్ణవ్ కార్యాలయానికి వెళ్లి ఖాజీపేట నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వే లేన్‌ను నిర్మించాలని..

రైల్వే మంత్రితో బండి సంజయ్ భేటీ.. అక్కడ కొత్త రైల్వే లేన్‌ కోసం ప్రతిపాదన.. అశ్వీనీ వైష్ణవ్ ఏమన్నారంటే..?
Bandi Sanjay And Ashwini Vaishnaw
Follow us on

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ బుధవారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు.  ఈ రోజు న్యూఢిల్లీలోనే ఉన్న బండి సంజయ్.. అశ్వీనీ వైష్ణవ్ కార్యాలయానికి వెళ్లి ఖాజీపేట నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వే లేన్‌ను నిర్మించాలని కోరారు. అలాగే ఈ నెల 8న వరంగల్‌లో ఖాజీపేట వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్, పీవోహెచ్‌కు సంబంధించి భూమి పూజను ప్రధాని మోదీ చేయనున్న నేపథ్యంలో దాని ఏర్పాట్లపై అశ్వినీ వైష్ణవ్, బండి సంజయ్ చర్చించారు. అనంతరం ఖాజీపేట నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వే లేన్ నిర్మాణానికి సంబంధించి సత్వర చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బండి సంజయ్ కోరారు.

బండి సంజయ్ విన్నపంపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి అశ్వీనీ వైష్ణవ్ వెంటనే ప్రాజెక్టు సమగ్ర నివేదికను తెప్పించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు మంత్రి వైష్టవ్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈ సమావేశంలో బండి సంజయ్‌తో పాటు కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి జె.సంగప్ప పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.