కాసుల కోసం కన్నతల్లి కర్కశం.. శిశు విక్రయ ముఠాతో చేతులు కలిపి.. చివరకు పోలీసులకు చిక్కి

కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి, ఆ పసి పిల్లాడి పట్ల కర్కశంగా వ్యవహరించింది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి.. పెంచిపెద్ద చేయాల్సిన బాధ్యతను విస్మరించింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన అమ్మే...

కాసుల కోసం కన్నతల్లి కర్కశం.. శిశు విక్రయ ముఠాతో చేతులు కలిపి.. చివరకు పోలీసులకు చిక్కి
Child Sale
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 26, 2022 | 12:17 PM

కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి, ఆ పసి పిల్లాడి పట్ల కర్కశంగా వ్యవహరించింది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి.. పెంచిపెద్ద చేయాల్సిన బాధ్యతను విస్మరించింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన అమ్మే తన బిడ్డను అమ్మేసింది. కాసుల మోజులో పడి పుట్టిన బిడ్డను పరాయి వాళ్లకు అప్పగించింది. భర్త వదిలేయడంతో చిన్నారి పోషణ కష్టతరమవుతుందని ఈ దారుణానికి ఒడి గట్టింది. శిశువులను విక్రయించే ముఠా నాయకుడితో చేతులు కలిపింది. అతను, మరి కొందరు మహిళల సహకారంతో శిశువు పుట్టగానే రూ.2.5లక్షలకు విక్రయించింది. అనంతరం చిన్నారిని కిడ్నాప్ చేశారని కట్టు కథ అల్లింది. పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసింది. వారి వ్యవహారంపై పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. బాలుడిని స్వాధీనం చేసుకుని ముఠా నిర్వాహకుడితో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు, చిన్నారిని శిశుగృహకు తరలించారు.

హైదరాబాద్(Hyderabad) షాహిన్‌నగర్‌లో నివాసముండే మహిళ.. ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్న సమయంలో తన భర్త నుంచి వేరుగా టప్పాచబుత్ర జిర్రాలో వెళ్లి స్థిరపడింది. తల్లితో కలిసి జీవిస్తున్న ఆమె.. గతనెల 22న ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. భర్త లేకపోవడంతో బిడ్డ పోషణ భారమవుతుందని భావించి, చిన్నారులను విక్రయించే ముఠా నాయకుడిని సంప్రదించింది. అతను వెంటనే తన ముఠాలోని ఐదుగురు మహిళలతో కలిసి బాలింత, ఆమె తల్లి అంగీకారంతో జీడిమెట్లలోని ఓ కుటుంబానికి రూ.2.50 లక్షలకు విక్రయించారు(child sale). అనంతరం డబ్బులు పంచుకున్నారు. బంధువులు బిడ్డ ఏక్కడ అని అడుగుతారేమోనన్న భయంతో.. తల్లి అపహరణ(Kidnap) నాటకం ఆడింది. శిశువుకు పేరు పెట్టించేందుకు మౌల్వీ దగ్గరకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బిడ్డను అపహరించారని అదే రోజు అర్ధరాత్రి టప్పాచబుత్ర ఠాణాలో ఫిర్యాదు చేసింది.

పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసు నిందితులు బాలాపూర్‌ ఠాణా పరిధిలో ఉంటారని ఉన్నతాధికారులకు టప్పాచబుత్ర పోలీసులు తెలిపారు. దీంతో వారు బాలాపూర్‌ ఠాణాకు కేసును అప్పగించారు. దీనిపై అప్పటికప్పుడే బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఫిర్యాదు చేసిన తల్లి, అమ్మమ్మలే నిందితులని నిర్ధరించారు. బాలుడిని స్వాధీనం చేసుకుని ముఠా నిర్వాహకుడితో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.

Also Read

Veto power: వీటో పవర్ అంటే ఏమిటి.. రష్యా ఎన్నిసార్లు భారత్‌కు అనుకూలంగా దీన్ని ఉపయోగించింది..

Viral Video: పిల్లి పాము మధ్య భీకరమైన ఫైట్‌ !! వీడియో

బ్యాండ్ వాయిస్తూ నెటిజన్ల మతిపోగొడుతూ !! తగ్గేదెలే అంటున్న శునకం.. వీడియో