Telangana Gulf Migrants: ప్రభుత్వ పరంగా పూర్తి అండదండలు అందిస్తా… గల్ఫ్ వలస కార్మికులకు భరోసా ఇచ్చిన వినోద్ కుమార్

|

Jan 12, 2021 | 10:16 PM

Telangana Gulf Migrants: గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ హామీ ఇచ్చారు.

Telangana Gulf Migrants: ప్రభుత్వ పరంగా పూర్తి అండదండలు అందిస్తా... గల్ఫ్ వలస కార్మికులకు భరోసా ఇచ్చిన వినోద్ కుమార్
Follow us on

Telangana Gulf Migrants: గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా పూర్తి అండదండలు అందిస్తామని భరోసా ఇచ్చారు. మంగళవారం నాడు గల్ఫ్ వలస కార్మిక సంఘాల ప్రతినిధులు వినోద్ కుమార్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేయాలని, గల్ఫ్‌లో మృతి చెందిన వారి భౌతికకాయాన్ని ప్రభుత్వ ఖర్చులతో స్వగ్రామాలకు తరలించాలని, విదేశీ జైలులో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం అందించాలని, ప్రవాసులకు బీమా సౌకర్యం కల్పించాలని, స్వదేశానికి తిరిగి వచ్చే ప్రవాసులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు వినోద్ కుమార్‌ను కోరారు.

వారి అభ్యర్థనలకు స్పందించిన వినోద్ కుమార్.. తెలంగాణ నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లిన కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. గల్ఫ్‌ దేశాలలో వారు పడుతున్న ఇబ్బందులేంటో తనకు బాగా తెలుసునని, వారి సమస్యల పరిష్కారినికి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారని వినోద్ చెప్పుకొచ్చారు. గల్ఫ్ వలస కార్మిక సంఘాల ప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.

Also read:

Minister Letter: తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సర్పంచ్‌లకు లేఖ రాసిన మంత్రి ఈటల రాజేందర్.. ఆ లేఖలో ఏముందంటే..

Coronavirus: పది రోజుల్లోనే అధ్యక్ష ఎన్నికలు.. కరోనా బారిన పడిన దేశ అధ్యక్షుడు.. బహిరంగ సమావేశాలు రద్దు