సీఎం కేసీఆర్‌ను కలిసిన టీడీపీ ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.. అసెంబ్లీ హాల్‌లో అందరిచూపు అటు వైపే..!

తెలుగుదేశంపార్టీకి చెందిన అశ్వారావు నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అసెంబ్లీ హాల్‌లో కలుసుకున్నారు.

సీఎం కేసీఆర్‌ను కలిసిన టీడీపీ ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.. అసెంబ్లీ హాల్‌లో అందరిచూపు అటు వైపే..!
Ashwaraopet Mla Mecha Nageswar Rao Meet Cm Kcr

Updated on: Mar 18, 2021 | 5:49 PM

TD MLA Mecha Nageswar Rao meet CM KCR : తెలుగుదేశంపార్టీకి చెందిన అశ్వారావు నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అసెంబ్లీ హాల్‌లో కలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టీడీపీ ఎమ్మెల్యే కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీఆర్‌ఎస్‌‌లో చేరిపోయారు. తెలంగాణలో మిగిలిన ఏకైక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కావడం విశేషం. అయితే, అసెంబ్లీ హాల్‌లో సీఎం కేసీఆర్‌తో నాగేశ్వరరావు సమావేశం కావడం అందరి ద‌ృష్టిని ఆకర్షించింది. నాగేశ్వరరావు సీఎం కేసీఆర్‌లో మాట్లాడుతున్నంత సేపు ఇతర ఎమ్మెల్యేల ద‌ృష్టి అంతా అక్కడే కేంద్రకృతమైంది.

ఇదిలావుంటే , ఖమ్మం జిల్లాలో పెండింగ్ సమస్యల పరిష్యారానికి సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యినట్లు నాగేశ్వరరావు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీ హాల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఖమ్మం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. మెట్ట, ఆరుతడి పంటలకు నీరు అందించి ఆయా ప్రాంతాల్లోని రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతూ ఆయన ముఖ్యమంత్రికి ఓ వినతి పత్రాన్ని అందజేశారు.

ఇదిలావుంటే, ఖమ్మం జిల్లాలోని వెంగలరావు సాగర్ ప్రాజెక్ట్(చండ్రుగొండ), మూకమామిడి ప్రాజెక్ట్(ములకలపల్లి),గుమ్మడవల్లి ప్రాజెక్ట్(అశ్వారావుపేట) పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్లు నాగేశ్వరరావు తెలిపారు. అలాగే, ఇంటి స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోడానికి రూ. 5లక్షల ప్రభుత్వ సహాయ కార్యక్రమం రాష్ట్రంలో త్వరగా అమలు చేయాలని కోరారు.

అలాగే, ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇప్పించాలన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఆరోగ్య సమస్యలు వస్తే ఆంధ్ర ప్రాంతం లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, దీంతో ఆరోగ్యం విషమంగా ఉన్న సమయంలో ప్రాణాల మీదకు వస్తుందని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే చొరవ తీసుకుని అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. ఇక పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు వెంటనే మంజూరు చేయాలన్నారు. మరోవైపు, టీడీపీకి చెందిన ఏక ఎమ్మెల్యే కూడా సీఎం కేసీఆర్‌ను కలవడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.పంజాబ్ లో తొమ్మిది జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ మరో రెండు గంటల పొడిగింపు., సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్

Read Also…