కేసీఆర్‌ ప్రకటనను స్వాగతించిన ఓవైసీ

సచివాలయ భవనాలను కూల్చివేస్తున్న క్రమంలో అక్కడ ఉన్న దేవాలయం, మసీదులపై కొన్ని శిథిలాలు పడ్డాయన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆలయంతో పాటు మసీదు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ విషయం..

కేసీఆర్‌ ప్రకటనను స్వాగతించిన ఓవైసీ

Edited By:

Updated on: Jul 10, 2020 | 5:46 PM

సచివాలయ భవనాలను కూల్చివేస్తున్న క్రమంలో అక్కడ ఉన్న దేవాలయం, మసీదులపై కొన్ని శిథిలాలు పడ్డాయన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆలయంతో పాటు మసీదు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భవనాలను కూల్చే సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. కొత్త సచివాలయంతో పాటు.. ఆలయం, మసీదులను తిరిగి నిర్మిస్తామని తెలిపారు. ఇప్పుడు ఉన్న స్థలం కంటే.. మరింత విశాలంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని తెలిపారు. జరిగిన సంఘటనను అంతా సహృదయంతో అర్ధం చేసుకోవాలని సీఎం కేసీఆర్ ప్రజల్ని కోరారు. అయితే సీఎం కేసీఆర్ చేసిన ఈ ప్రకటనపై ఎంఐఎం పార్టీ చీఫ్.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. యునైటెడ్‌ ముస్లిం ఫోరం తరఫున దీనికి సంబంధించిన ఓ ప్రకటనను కూడా విడుదల చేస్తామన్నారు.