ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే వారు బీఈడీ కోర్సలో చేరేందుకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం ఎడ్ సెట్(Ed.cet) నోటిఫికేషన్ ను విడుదల చేసింది. జులై 26, 27 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ కన్వీనర్ తెలిపారు. ఈ నెల 7 వ తేదీ జూన్ 15 వరకు దరఖాస్తులు(Applications) ఆహ్వనిస్తున్నట్టు తెలిపారు. ఎడ్ సెట్ ఎంట్రెన్స్ పరీక్ష కోసం దరఖాస్తు దారులు రూ. 600 చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం రూ.450 చెల్లించాలని వివరించారు. రూ.250 ఆలస్య రుసుంతో జులై 1 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో జులై 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మొత్తం 19 రీజినల్ సెంటర్లు, 55 పరీక్ష కేంద్రాలతో ఎడ్ సెట్ ఎంట్రెన్స్ ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డిగ్రీ , ఇంజనీరింగ్ లో 50 శాతం మార్క్స్ తో పాస్ అయిన వారు దరఖాస్తుకు అర్హులని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ దరఖాస్తు దారులకు 40 శాతం మార్కులు వచ్చిన వారు అర్హులు అని వివరించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 220 బీఈడీ కాలేజీల్లో 19,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 50 శాతం మార్కులతో డిగ్రీ, ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎడ్‌సెట్‌కు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే చాలని కన్వీనర్ తెలిపారు. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ప్రవేశ పరీక్ష రాయొచ్చని పేర్కొన్నారు. ఎంబీబీఎస్, బీఫార్మసీ, అగ్రికల్చర్ బీఎస్సీ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివిన వారు బీఈడీకి అనర్హులని కన్వీనర్ స్పష్టం చేశారు.
Also Read
Andhra Pradesh: వివాదాలతో మొదలైన కొత్త జిల్లా ఆవిర్భావం.. కలెక్టర్‌పై వైసీపీ ఎమ్మెల్యేల గరం గరం..
SRH vs LSG: స్టోయినిస్ నుంచి ఫిలిప్స్ వరకు.. నేటి మ్యాచ్‌లో కనిపించని దిగ్గజ ఆటగాళ్ళు వీరే..
Selfie: సెల్ఫీలతో వచ్చిన తంటా.. హాస్పిటల్స్‌కు పరిగెడుతోన్న జనాలు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు?