
తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రెండు రాష్ట్రాల్లో రాబోయే రెండు మూడుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. దక్షిణ ఒడిశా తీరం వెంబడి ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వైపు కదులుతూ ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతవారణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణలో వర్షాలు
ఈ అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం నుంచి ఆదివారం మధ్య ఉంటుంది, ముఖ్యంగా సెప్టెంబర్ 12-13 తేదీలలో ప్రభావం అత్యధికంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచానా వేసింది.అలాగే 15-17 మధ్య వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణలో మోస్తరు నుండి భారీ వర్షాలు, తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 50-70 మి.మీ వరకు వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది
అలాగే హైదరాబాద్, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో సెప్టెంబర్ 12-13 తేదీలలో మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని. అదే సమయంలో, గద్వాల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలు ఈ వర్షాల ప్రభావం కాస్త తక్కువగానే ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
అల్పపీడనం ఎఫెక్ట్‌తో.. ఇవాళ, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. అలాగే ఉత్తర కోస్తా వెంబడి గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ముఖ్యంగా ఈ రోజు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతవారణ శాఖ తెలిపింది. ఇక పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఇతర జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలే కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,