
తెలుగురాష్ట్రాలకు మరోసారి భారతవాతవరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. నేడి నుంచి రాబోయే ఆరు రోజుల వరకు రెండు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని.. దీని ప్రభావంతోనే రాబోయే వారం రోజుల పాటు వర్షాలు కురసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో నేటి వాతావరణం
వాతావరణ శాఖ ప్రకారం.. ఏపీలో నేడు పొడి వాతావరణంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలోని కొన్ని జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే ఈ నెల18 వరకూ కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంలో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది
తెలంగాణలో వాతావరణం ఇలా
అటు తెలంగాణలో కూడా పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర తెలిపింది. శనివారం తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి తెలికపాటి వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. పంద్రాగస్ట్ వేడుకల నేపథ్యంలో వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.