Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ దంచికొడుతున్న వానలు.. మరో రెండు రోజులపాటు ఇంతే..

|

Sep 21, 2021 | 5:55 PM

దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు పడతాయని ప్రకటించింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని తెలిపింది.

Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ దంచికొడుతున్న వానలు.. మరో రెండు రోజులపాటు ఇంతే..
Heavy Rain
Follow us on

దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు పడతాయని ప్రకటించింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని తెలిపింది. ఇక పశ్చిమ బెంగాల్‌ పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఉత్తర, దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది. రాయలసీమలో పలుచోట్ల జల్లులు కురుస్తాయని తెలిపారు వాతావరణశాఖాధికారులు.

దక్షిణ గంగేటిక్ పశ్చిమ బంగాల్ , పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి తోడు ఉపరితల ద్రోణి, అల్పపీడనం నుంచి తెలంగాణ వరకు కొనసాగుతుంది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగా కొనసాగుతున్నాయి. రానున్న 48 గంటల్లో హైదరాబాద్ , ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

తెలుగు రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర ఒడిసా, పశ్చిమ బెంగాల్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తమిళనాడు తీరంలో మరో ఆవర్తనం ఉంది. బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

గడిచిన 24 గంటల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైనట్లుగా వెల్లడించారు. అత్యధికంగా టెక్మాల్ 13 సెం.మీ , తాండూరు 10 సెం.మీ , హైదరాబాద్ 9.1 సెం.మీ సిరిపూర్ 8 సెం.మీ నమోదైంది.

ఇవి కూడా చదవండి: Revanth Reddy: రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్.. ఇంటి ముట్టడికి ప్రయత్నించిన టీఆర్ఎస్.. అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు..