
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎన్నికల ప్రచారాన్ని ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభిస్తోది. అమిత్ షా ప్రచారం ఆదిలాబాద్‌లో బహిరంగ సభతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మంగళవారం హైదరాబాద్‌లో మేధావుల సమ్మేళనం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీ, సాయంత్రం మేధావుల సమ్మేళనం జరుగుతుందని కమలం వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో షా పార్టీ నేతలతో సమావేశమై ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు.
అమిత్ షా పర్యటన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గణనీయమైన ఊపునిస్తుందని తెలంగాణలో బీజేపీ ధీమాగా ఉంది. గతంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల ప్రారంభంలో తెలంగాణలో ప్రత్యేకంగా మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ర్యాలీలలో ప్రసంగించారు. నిజామాబాద్‌లో పసుపు రైతుల చిరకాల డిమాండ్ అయిన నేషనల్ టర్మరిక్ బోర్డును, రాష్ట్రంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని మోదీ తన పర్యటనలో ప్రకటించారు.సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ స్థాపన అనేది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీ. అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ చేస్తున్న ప్రచారంలో పలువురు సీనియర్ పార్టీ నేతలు పాల్గొంటారని భావిస్తున్నారు.
ప్రధాని మోదీ హామీలతో ఉత్సాహంగా ఉన్న కమల దళం..అదే ఊపుతో అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అభ్యర్థుల కోసం గట్టి కసరత్తు చేస్తోంది బీజేపీ. 119 అసెంబ్లీ స్థానాలకు గాను మూడు విడతలలో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బీజేపీ ఉంది . లోక్‌సభ కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న క్రమంలో పార్టీలోని ముఖ్య నేతలంతా బరిలో నిలవాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర నేతలు ఆ మేరకు సన్నద్దమవుతున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు బిఆర్‌ఎస్ ముఖ్య నేతలు పోటీ చేస్తున్న చోట..బలమైన నేతలను బరిలోకి దించాలనే ఆలోచనలో అధినాయకత్వం ఉంది. ఇందుకు సంబంధించిన కసరత్తులు చేస్తున్న నాయకత్వం ఈనెల 15 లేదా 16న..38 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.
పదేళ్లుగా గిరిజన వర్శిటీ తెలంగాణాలో ఏర్పాటు చెయ్యాలని మోదీ ప్రయత్నిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం స్థలమే ఇవ్వలేదని ఆరోపించారు షా. తెలంగాణలో ఇప్పటికీ రజాకర్ల పోకడలు పోలేదని విమర్శించారు అమిత్‌షా. ఈనాటి రజాకార్ల నుంచి తెలంగాణను కాపాడేది బీజేపీ మాత్రమే అంటూ నినదించారు షా. కేటీఆర్‌ని సీఎం చెయ్యడమే కేసీఆర్ లక్ష్యమన్నారు అమిత్‌షా. 2014 నుంచి సీఎం అదే పనిలో ఉన్నారని విమర్శించారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలన్నారు షా. ఇంతకీ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో తెలుసా అని అడిగి మరీ ఆయనో క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 3న తెలంగాణలో ఎగరబోయేది బీజేపీ జెండానే అన్నారు అమిత్ షా. ఆదిలాబాద్ సభలో ఆ ధీమా వ్యక్తం చేశారు
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ తో పాటు ప్రతి జిల్లాలో తెలంగాణ విమోచనా దినోత్సవం అధికారికంగా జరుపుతామని కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. అదేవిధంగా గిరిజనులకు 3 ఎకరాల భూమి, రూ. 10 లక్షల దళిత బంధు హామీలు ఏమయ్యాయని కేసీఆర్ పై విమర్శల వర్షం గుప్పించారు.
రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిందని అమిత్ షా కేసీఆర్ సర్కారుపై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మజ్లిస్ చేతిలోనే ఉందని, కేటీఆర్ ను సీఎం చేయాలన్నదే కేసీఆర్ సంకల్పమని కేంద్ర మంత్రి ఫైర్ అయ్యారు.
తెలంగాణకు డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని అమిత్ షా చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అక్కడా, ఇక్కడా మోదీయేనని అన్నారు. గిరిజన యూనివర్సిటీకి 10 ఏళ్లుగా కేసీఆర్ సర్కార్ ఎలాంటి స్థలాన్ని కేటాయించలేదని అమిత్ షా మండిపడ్డారు.
పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు కాబోతోంది అమిత్ షా పేర్కొన్నారు. కృష్ణా జలాల వాటా కోసం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది మోదీయేనని అమిత్ షా చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ను గద్దె డించి బీజేపీకి అధికారం ఇచ్చేందుకు పిడికిలి బిగించండంటూ ప్రజలకు పిలుపునిచ్చారు అమిత్ షా..
డిసెంబర్ 3న తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ సర్కార్ వస్తే విమోచన దినోత్సవం ప్రతీ జిల్లాలో నిర్వహిస్తామని చెప్పారు.
ఆదిలాబాద్ సభలో ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎక్కడా 24 గంటల కరెంట్ రావడం లేదని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎక్కడైనా వచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు.
ఆదిలాబాద్‌లోని జనగర్జన బహిరంగ సభ జరిగే సభాస్థలికి చేరుకున్న కేంద్రమంత్రి అమిత్‌షా.
ఆదిలాబాద్ జనగర్జన సభలో పాల్గొనేందుకు నాగపూర్ నుండి ఆదిలాబాద్ కు చేరుకున్న అమిత్ షా
ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో అమిత్ షా కు ఘన స్వాగతం పలికిన బీజేపీ అద్యక్షుడు కిషన్ రెడ్డి , జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్, ఎంపి సోయం బాపురావు
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై బీజేపీ నేతలతో అమిత్ షా చర్చిస్తారు. రాత్రి 7.30 కు ఐటీసీ కాకతీయలో బీజేపీ క్యాడర్‌తో సమావేశం అవుతారు. తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల వ్యూహాలపై పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్ధేశం చేస్తారు. ఇక రాత్రి 9గంటల 40 నిమిషాలకు ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం నాడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం బేగంపేటకు చేరుకుంటారు అమిత్ షా. అక్కడి నుంచి ఆదిలాబాద్‌కు పయనమవుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు బహిరంగ సభ ఉంటుంది. ఆ సభలో అమిత్ షా పాల్గొంటారు. మళ్లీ సాయంత్రం 4.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి.. 5.05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తరువాత సాయంత్రం 6.20 గంటలకు మేధావులతో అమిత్ షా సమావేశం అవుతారు. రాత్రి 7.40 గంటలకు ఐసీసీ కాకతీయలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో.. ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహం, స్ట్రాటజీ, సమన్వయం, తాజా రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. ఇక రాత్రి 9:40కి బేగంపేట నుంచి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు అమిత్ షా.