Munugode Bypoll: మునుగోడులో హోరెత్తుతున్న ప్రచారం.. ప్రచారానికి క్యూ కట్టిన పార్టీల అగ్రనేతలు.. టీఆర్‌ఎస్‌,బీజేపీ,కాంగ్రెస్‌ ఇంటింటికి..

|

Oct 21, 2022 | 9:21 PM

మునుగోడులో ప్రచారం ఊపందుకుంది. ఓటర్ల దేవుళ్లను ప్రసన్నం చేసుకునేపనిలో పడ్డారు నేతలు. టీఆర్‌ఎస్‌,బీజేపీ,కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాటలయుద్ధం కంటిన్యూ అవుతోంది. గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రధానపార్టీల నేతలు...ఆ హైలెట్స్‌ ఇవే..

Munugode Bypoll: మునుగోడులో హోరెత్తుతున్న ప్రచారం.. ప్రచారానికి క్యూ కట్టిన పార్టీల అగ్రనేతలు.. టీఆర్‌ఎస్‌,బీజేపీ,కాంగ్రెస్‌ ఇంటింటికి..
Munugode
Follow us on

ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం హోరెత్తుతోంది. టీఆర్‌ఎస్‌,బీజేపీ,కాంగ్రెస్‌ పార్టీల నేతలు, కార్యకర్తలు జోరుగా క్యాంపెయిన్‌ చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. తమ పార్టీకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అటు మంత్రి కేటీఆర్‌ కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్‌ వరకూ 5 కిలోమీటర్లు రోడ్‌ షో నిర్వహించారు. అటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, రఘునందన్‌రావు, బూర నర్సయ్య, వెంకటస్వామి, రాజగోపాల్‌రెడ్డి ప్రచారం చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెం మండలం దామెర భీమనపల్లిలో మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు.ఈ ఎన్నిక అహంకారానికి-ఆత్మగౌవరానికి జరుగుతున్న పోరు అన్నారు. ఇక చండూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 8 ఏళ్లుగా బీజేపీ కేంద్రంలో ఉండి తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

మర్రిగూడెం మండలం అంతంపేటలో ఎమ్మెల్యే రాజయ్య వినూత్నరీతిలో ప్రచారం నిర్వహించారు. గ్రామంలో సైకిల్‌ తొక్కుతూ ప్రచారం చేశారు. ప్రజలకు వైద్యం చేస్తూ వారితో కలిసిపోయారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మునుగోడు మండలంలోని చల్మెడ,కోతులారం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. దళితవాడలో టీ తాగి వారితో కొద్దిసేపు ముచ్చటించారు. కమలం గుర్తుపై ఓటువేసి రాజగోపాల్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలింపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అంతకుముందు ప్రచారానికి వెళ్తున్న కిషన్‌రెడ్డి వాహనాన్ని కేంద్ర బలగాలు తనిఖీ చేశాయి.

మర్రిగూడ మండలంలో మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన ఉద్యమకారులంతో తిరిగి ఆ పార్టీలోకి చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇదంతా కేసీఆర్‌ ఆడుతున్న మైండ్‌గేమ్‌ అని విమర్శించారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారం కూడా ఊపందుకుంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు మద్యం, డబ్బు పంచుతూ ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. మొత్తానికి మునుగోడులో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రచారానికి ఆయా పార్టీల అగ్రనేతలు క్యూ కట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం