50 శాతం సీలింగ్ బద్దలుకొట్టేదెలా..? తెలంగాణ ఫార్ములాపై దేశవ్యాప్త ఉత్కంఠ!

తెలంగాణ పాలిటిక్స్‌లోనే కాదు, ప్రభుత్వవర్గాలకూ ఇవాళ బిగ్‌డే అని, బీసీ కోటాపై మెగా సస్పెన్స్‌కు తెరపడేది ఇవాళే అని రాష్ట్రమంతా ఆసక్తిగా చూసింది. కోర్టు ఏం చెప్పబోతోంది...? బీసీ రిజర్వేషన్లపై ఏం చేయబోతోంది...? అంటూ అటు ఎలక్షన్ కమిషన్‌ కూడా ఎటెన్షన్‌ మోడ్‌లోకొచ్చేసింది. కానీ ఇంకా మిగిలే ఉందంటూ విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అయితే... ఇవాళ్టి వాదనలతో హైకోర్టు హీటెక్కింది. అటు లోపల వాదనలు... ఇటు బయట ఉత్కంఠ పరిస్థితులతో గంభీర వాతావరణం నెలకొంది.

50 శాతం సీలింగ్ బద్దలుకొట్టేదెలా..? తెలంగాణ ఫార్ములాపై దేశవ్యాప్త ఉత్కంఠ!
Bc Reservations In Telangana

Updated on: Oct 08, 2025 | 10:15 PM

బీసీ రిజర్వేషన్ల విషయంలో రేపటి హైకోర్టు తీర్పుపై తెలంగాణ అంతటా ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేష్లపై గురువారం (అక్టోబర్ 9) మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై సుదీర్ఘ విచారణ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ మాధవరెడ్డి, రమేశ్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఆర్‌.కృష్ణయ్య, వి.హనుమంతరావుతో పాటు పలువురు బీసీ నేతలు ఇంప్లీడ్‌ పిటిషన్లు వేశారు. అన్ని పిటిషన్లను కలిపి విచారించింది సీజే జస్టిస్‌ ఏకే సింగ్‌ నేతృత్వంలోని ధర్మాసనం. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకుండా స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ‘రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు..’ అసలు ఈ రూల్ ఉందా భారత రాజ్యాంగంలో..? కేవలం న్యాయస్థానం మాత్రమే విధించిన పరిధా..? 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని చెప్పిన ఆ న్యాయస్థానమే EWS కింద 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వొచ్చని ఎలా చెప్పింది..? రిజర్వేషన్లు 50 శాతం మించుతున్నా సరైనదేనని ధర్మాసనం ఎలా చెప్పింది? అలాంటప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతున్నప్పుడే ’50 శాతం సీలింగ్’ అనే అంశం ఎందుకు తెరపైకి వస్తోంది? అసలు.. 50 శాతం కోటా అనే కాన్సెప్ట్ పుట్టుకకు కారణమేంటి? రిజర్వేషన్ల పెంపు బీహార్‌లో అజ్యం..! 1979లో వెనుకబడిన తరుగతులకు రిజర్వేషన్ ఇవ్వడం కోసం బీహార్‌లోని...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి