Telangana: యాసంగిలో వరి ధాన్యం కొనలేము.. రైతులకు పలు సూచనలు చేసిన రాష్ట్ర సర్కార్..

|

Nov 06, 2021 | 9:19 PM

తెలంగాణలో వరి మంటలు రాజుకుంటున్నాయి. యాసంగిలో ధాన్యం కొనలేమంటూ కరఖండిగా తేల్చి చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ధాన్యం కొనమని FCI చేతులెత్తేసినప్పుడు..

Telangana: యాసంగిలో వరి ధాన్యం కొనలేము.. రైతులకు పలు సూచనలు చేసిన రాష్ట్ర సర్కార్..
Niranjay Reddy
Follow us on

తెలంగాణలో వరి మంటలు రాజుకుంటున్నాయి. యాసంగిలో ధాన్యం కొనలేమంటూ కరఖండిగా తేల్చి చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ధాన్యం కొనమని FCI చేతులెత్తేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలదని ప్రశ్నించారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. అందుకే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. సమ్మర్‌లో వేడి ఎక్కువ ఉండటంతో బియ్యం గింజలు పగులుతున్న కారణంగా కొనుగోలు చేయలేమని FCI తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమైన ప్రాసెస్ చేసి ఎక్స్‌పోర్ట్ చేయగలదా అని ప్రశ్నిస్తున్నారు. వానాకాలంలో వరి కొంటామని చెప్తున్న నిరంజన్ రెడ్డి యాసంగిలో మాత్రం కొనలేమంటున్నారు.

ప్రభుత్వ విదానం సైతం ఇదే అని వానాకాలం పంటకు సంబందించి ఎప్పుడైనా ప్రభుత్వం ధాన్యాన్ని సేకరిస్తుందని.. యాసంగిలో మాత్రం విత్తన కంపెనీలు, రైస్ మిల్లులతో ఒప్పందాలు ఉన్నవారు మాత్రమే దొడ్డు వడ్లను పండించుకోవచ్చన్నారు. ప్రస్థుతం రాష్ట్రంలో సాగవుతున్న 1కోటీ 41లక్షల 50వేల ఎకరాల్లో దాదాపు 62 లక్షల 8వేల ఎకరాల్లో వరి సాగవుతుందన్నారు. వ్యవసాయంపై ఆపేక్ష, మనుసు ఉన్న ముందుచూపు గల ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. వ్యవసాయానికి అన్ని అందుబాటులో ఉన్నాయని.. రైతులపై గల తపన, చిత్తశుద్దిని శంకించాల్సిన అవసరం లేదన్నారు.

ఇదే సమావేశంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారని ద్వజమెత్తారు. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఇప్పటికే 86 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని.. వాటిలోకి ఒక్క గింజ ధాన్యాన్ని రైతులు తేలేదన్నారు. మీడియాలో చూపిస్తున్నవి ప్రైవేట్ మిల్లులకు సంబందించిన వడ్లని.. రైతులే తమ సన్న వడ్లని నేరుగా ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకోవడానికి క్యూలో పెట్టారని..  లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కాకుండా టోకెన్లను స్థానిక యంత్రాంగం ఇష్యూ చేసిందన్నారు.

ప్రతీ ఊళ్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు గంగుల. కోతలు ఎట్లా వస్తుంటే అట్లా కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నామని ఇందుకు సంబందించి అధికారాన్ని స్థానిక యంత్రాంగానికే అప్పగించామన్నారు. ప్రతీ ఊళ్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అగ్రికల్చర్, సవిల్ సప్లైస్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చోట కొనుగోలు కేంద్రాల్ని ఓపెన్ చేస్తున్నారన్నారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2142 కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసి 3565 మంది రైతుల నుండి 2లక్షల 36వేల క్వింటాళ్ల దాన్యం కొనుగోలు చేసామన్నారు. టోకెన్ సిస్టం అనే సమస్యే ఉత్పన్నం కాలేదన్నారు మంత్రి గంగుల. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన పెంచాలన్నారు మంత్రి గంగుల.

మరోవైపు రేపటి నుంచి జిల్లాల బాట పడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లు, రైతుల ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకునేందుకు 4 బృందాలుగా విడిపోయి నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో పర్యటిస్తారు.

ఇవి కూడా చదవండి: Google Pay: గూగుల్‌ UPI పిన్‌ని మరిచిపోతున్నారా.. మార్చాలా.. చాలా ఈజీ.. ఎలానో తెలుసుకోండి..

Spectacle Marks: కళ్ల జోడు వాడకంతో ముక్కుపై మచ్చలు ఏర్పడుతున్నాయా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..