అగ్రిగోల్డ్ వైస్ ఛైర్మన్ మృతి..!

| Edited By: Ram Naramaneni

Apr 02, 2019 | 7:09 PM

హైదరాబాద్: అగ్రిగోల్డ్ వైస్ ఛైర్మన్ ఇమ్మడి సదాశివ వరప్రసాదరావు గుండె పోటుతో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ కౌంటర్ నుంచి సోమవారం బయటికి వస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు నీళ్లు తాగించి, హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. వరప్రసాదరావు వద్ద లభ్యమైన వివరాలు ఆధారంగా ఆయన బంధువులకు సమాచారం అందించారు పోలీసులు. ఆయన […]

అగ్రిగోల్డ్ వైస్ ఛైర్మన్ మృతి..!
Follow us on

హైదరాబాద్: అగ్రిగోల్డ్ వైస్ ఛైర్మన్ ఇమ్మడి సదాశివ వరప్రసాదరావు గుండె పోటుతో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ కౌంటర్ నుంచి సోమవారం బయటికి వస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు నీళ్లు తాగించి, హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. వరప్రసాదరావు వద్ద లభ్యమైన వివరాలు ఆధారంగా ఆయన బంధువులకు సమాచారం అందించారు పోలీసులు. ఆయన బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.