గుడి, బడి కంటే వైన్ షాపే ముఖ్యం.. ఏజెన్సి గ్రామాల్లో విచిత్ర తీర్మానం.. వివరాలివే..

| Edited By: శివలీల గోపి తుల్వా

Aug 02, 2023 | 7:08 PM

Warangal: 'మాకు మద్యం షాపులు కావాలి' అంటూ పీసా గ్రామ సభ ద్వారా ఆదివాసీ ప్రజలు ఆమోదం తెలిపారు. మల్లూరు, వాగొడ్డుగూడెం, గంపోని గూడెం, తిమ్మంపేట, రాజుపేట గ్రామాల్లో పీసా కమిటీ గ్రామ సభలు నిర్వహించారు.. ఊరందారిని ఒక్కచోట సమావేశపరిచారు.. పీసా గ్రామ సభలో పాల్గొన్న గిరిజన ఓటర్లు ఆయా గ్రామాల్లో మద్యం షాపులు ఏర్పాటుకు ఆమోదం తెలుపారు.. మా వూరు గుడి బడి ఎంత ముఖ్యమో మద్యం కూడా అంతే ముఖ్యం అన్నారు.. చేతులు పైకెత్తి వారి నిర్ణయాన్ని..

గుడి, బడి కంటే వైన్ షాపే ముఖ్యం.. ఏజెన్సి గ్రామాల్లో విచిత్ర తీర్మానం.. వివరాలివే..
Agency Villagers
Follow us on

ములుగు జిల్లా, ఆగస్టు 2: సహజంగా మా వూళ్ళో వున్న వైన్ షాప్, బెల్ట్ షాపు తొలగించాలని తీర్మానాలు, నిరసనలు చేయడం చూస్తుంటాం.. కానీ ఇదో విచిత్ర తీర్మానం.. మా వూరికి వైన్ షాప్, బెల్ట్ షాపులు కావాలని ఏక వ్యాఖ్య తీర్మానాలు చేశారు. ఈ సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలో జరిగింది.. ‘మాకు మద్యం షాపులు కావాలి’ అంటూ పీసా గ్రామ సభ ద్వారా ఆదివాసీ ప్రజలు ఆమోదం తెలిపారు. మల్లూరు, వాగొడ్డుగూడెం, గంపోని గూడెం, తిమ్మంపేట, రాజుపేట గ్రామాల్లో పీసా కమిటీ గ్రామ సభలు నిర్వహించారు.. ఊరందారిని ఒక్కచోట సమావేశపరిచారు.. పీసా గ్రామ సభలో పాల్గొన్న గిరిజన ఓటర్లు ఆయా గ్రామాల్లో మద్యం షాపులు ఏర్పాటుకు ఆమోదం తెలుపారు.. మా వూరు గుడి బడి ఎంత ముఖ్యమో మద్యం కూడా అంతే ముఖ్యం అన్నారు.. చేతులు పైకెత్తి వారి నిర్ణయాన్ని తెలియ జేయాలని కమిటీ కోరింది.. ఈ మేరకు వూరంతా వైన్ షాప్ కాలలని చేతులెత్తి మద్దతు తెలిపారు.

ఐతే కోర్టు స్టే ఆర్డర్ కారణంగా మంగపేట మండలంలో గత 5 సంవత్సరాలుగా మద్యం షాపులకు టెండర్లు పిలవడం లేదు.. ఈ క్రమంలో పొరుగు గ్రామాలకు వెళ్లి సరుకు వేసుకునే వారు.. అలాంటి వారికి ఇప్పుడు మద్యం షాప్ విలువ తెలిసి వచ్చిందన్నారు.. ప్రతీ ఏజేన్సీ గ్రామానికి వైన్ షాప్ కావలనాడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోయారు.. లిక్కర్ షాప్ కోసం చేసిన తీర్మానంచేసిన ప్రతులను, గ్రామస్థులు నిర్ణయం మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు.