Telangana: అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 5వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.​ స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telangana: అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
Adilabad Suicide Incident

Edited By:

Updated on: Aug 12, 2026 | 4:53 PM

11 ఏళ్ల బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మైనారిటీ హాస్టల్‌లో 5వ తరగతి చదువుతున్న బాలికను, రేషన్ కార్డులో eKYC చేయించడం కోసం పది రోజుల క్రితం ఆమె తల్లి ఇంటికి తీసుకువచ్చింది. అయితే బాలిక తిరిగి హాస్టల్‌కు వెళ్లేందుకు ససేమీరా అంది. ఇంటి దగ్గరే ఉంటానంటూ మారం చేయడంతో తల్లి సరేనంది.

మరుసటి రోజు సైతం బాలిక అస్సలు హాస్టల్ కు వెళ్లడం ఇష్టం లేదనీ చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో కూతురిని హాస్టల్ నుండి మాన్పించి టీసీ (TC) తీసుకురావడానికి తల్లి హాస్టల్‌కు వెళ్ళింది.​ అయితే తనకు టీసీ ఇస్తారో ఇవ్వరో.. టీసీ ఇవ్వకపోతే మళ్లీ ఎక్కడ హాస్టల్‌కు వెళ్లాల్సి వస్తుందోనన్న భయంతో బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటనపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతికి హాస్టల్ భయమే కారణమా.. హాస్టల్ లో ఉండేందుకు బాలిక ఎందుకు ససేమీరా అంది.. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయ అన్న విషయంలో విచారణ జరుపుతున్నట్టు తెలిపారు గుడిహత్నూర్ ఎస్సై శ్రీకాంత్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us