రెండో రోజు ఫాస్ట్‌ ట్రాక్‌కోర్టుకు సమత కేసు నిందితులు

సమత’ హత్యాచార కేసులో నిందితులను పోలీసులు ఇవాళ ఆదిలాబాద్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో హాజరుపరిచారు. నిన్న కోర్టుకు హాజరు కాగా, కోర్టు ఇవాళ్టికి విచారణ వాయిదా వేయడంతో ఇవాళ కూడా నిందితులు కోర్టుకు హాజరయ్యారు. జిల్లా కారాగారం నుంచి నిందితులు షేక్‌ బాబు, షేక్‌ షాబుద్దీన్, షేక్‌ మఖ్దూంను కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు.జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆసిఫాబాద్‌ పోలీసులు 44 మంది సాక్షులతో కూడిన చార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ క్రమంలోనే సోమవారం నుంచి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో […]

రెండో రోజు ఫాస్ట్‌ ట్రాక్‌కోర్టుకు సమత కేసు నిందితులు

Updated on: Dec 17, 2019 | 3:02 PM

సమత’ హత్యాచార కేసులో నిందితులను పోలీసులు ఇవాళ ఆదిలాబాద్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో హాజరుపరిచారు. నిన్న కోర్టుకు హాజరు కాగా, కోర్టు ఇవాళ్టికి విచారణ వాయిదా వేయడంతో ఇవాళ కూడా నిందితులు కోర్టుకు హాజరయ్యారు.
జిల్లా కారాగారం నుంచి నిందితులు షేక్‌ బాబు, షేక్‌ షాబుద్దీన్, షేక్‌ మఖ్దూంను కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు.జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆసిఫాబాద్‌ పోలీసులు 44 మంది సాక్షులతో కూడిన చార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ క్రమంలోనే సోమవారం నుంచి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ ప్రారంభమైంది.
ఇందులోభాగంగా రోజుకు ఐదుగురు సాక్షుల చొప్పున విచారించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా బాధితురాలు దళిత మహిళ కావడంతో అత్యాచారం, హత్య కేసులతో పాటుగా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు అభిప్రాయపడుతున్నారు.