Telangana: జోడెడ్ల‌లో ఒక‌టి త‌నువు చాలించింది.. ఆ ఇంటి బిడ్డే కాడెద్దుగా మారాడు

|

Jun 15, 2021 | 6:34 AM

వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఆ రైతు. యంత్రాలతో సాగు చేసేంత డబ్బు అత‌డి వ‌ద్ద లేదు. ఖరీఫ్ సీజ‌న్​ రానే వచ్చింది.

Telangana: జోడెడ్ల‌లో ఒక‌టి త‌నువు చాలించింది.. ఆ ఇంటి బిడ్డే కాడెద్దుగా మారాడు
Son As Ox New
Follow us on

వ్యవసాయం చేసి ఆ రైతు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. యంత్రాలతో సాగు చేసేంత డ‌బ్బు లేదు. ఇంత‌లో ఖరీఫ్​ రానే వచ్చింది. ఉన్న ఎద్దులతోనే పొలాన్ని రెడీ చేసేందుకు పూనుకున్నాడు. ఇంతలోనే ఆట‌కం. ఓ ఎద్దు అనారోగ్యంతో అక‌స్మాత్తుగా చ‌నిపోయింది. ఇంత‌లో వ‌రుణుడు ప‌లుక‌రించాడు. డబ్బులు లేకపోవటం.. ఈ ఒడుదొడుకులన్నింటినీ దాటేందుకు.. తన కొడుకునే కాడెద్దును చేశాడు ఆ రైతు. కన్నకొడుకే కాడెద్దులా మారి పొలం చదను చేసిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంద్రవెల్లి మండలం డొంగర్‌గావ్‌కు చెందిన ఆదివాసీ రైతు అభిమాన్‌కు 6 ఎక‌రాల‌ పొలం ఉంది. ఖరీఫ్ సీజ‌న్ ప్రారంభం కావ‌డంతో వల్ల తనకున్న ఎద్దులతో పొలాన్ని చదను చేసే క్రమంలో.. అనారోగ్యంతో ఆదివారం రోజున ఓ ఎద్దు చనిపోయింది. ఇప్ప‌టికిప్పుడు మ‌రో ఎద్దును కొనాలంటే కనీసం రూ. 40వేలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. అంత డ‌బ్బు అభిమాన్ వ‌ద్ద లేదు. పైగా సొమవారం వరుణుడు పలకరించడం వల్ల సమయం దాటిపోకుండా ఉండాలంటే పొలాన్ని చదును చేయకతప్పని పరిస్థితి. ఉన్న ఒక్క ఎద్దుతోపాటు మరోవైపు తన కన్నకొడుకు సాయినాథ్‌నే కాడెద్దుగా మార్చి పొలం చదనుచేశాడు.

Also Read: వెండి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన సిల్వర్‌ ధర.. హైదరాబాద్‌లో మాత్రం భారీగా తగ్గింది

యాదాద్రికి సతీసమేతంగా సీజేఏ ఎన్వీ రమణ..