Adilabad CCI: ఆదిలాబాద్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ కథ ముగిసినట్టేనా? దశాబ్దాల పోరాటం బూడిదలో పోసిన పన్నీరేనా?

|

May 22, 2022 | 9:54 AM

Adilabad CCI: ఆదిలాబాద్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ కథ ముగిసినట్టేనా? కాలగర్భంలో కలిసిపోయినట్లేనా? కార్మికుల దశాబ్దాల పోరాటం బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోనుందా?

Adilabad CCI: ఆదిలాబాద్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ కథ ముగిసినట్టేనా? దశాబ్దాల పోరాటం బూడిదలో పోసిన పన్నీరేనా?
Adilabad Cci1
Follow us on

Adilabad CCI: ఆదిలాబాద్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ కథ ముగిసినట్టేనా? కాలగర్భంలో కలిసిపోయినట్లేనా? కార్మికుల దశాబ్దాల పోరాటం బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోనుందా?

ఆదిలాబాద్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు ఆఖరి పోరాటం జరుగుతోంది. మరికొన్ని గంటల్లో కేంద్రం ప్రకటించిన ఈ-టెండర్ల ప్రక్రియ ముగియబోతోంది. దాంతో, కార్మికులు, కుటుంబ సభ్యులు ఆందోళనను తీవ్రతరం చేశారు. అయితే, కార్మికుల ఆశలు ఆడియాశలుగానే మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. 1984లో ఘనంగా ప్రారంభమై, కేవలం పద్నాలుగేళ్లలోనే మూతపడిన ఆదిలాబాద్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ కాలగర్భంలో కలిసిపోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సీసీఐను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చినా, కేంద్రం మాత్రం స్క్రాప్‌ కింద అమ్మేయడానికి ఈ-టెండర్లు పిలిచి తమ నోట్ల మట్టి కొట్టిందంటున్నారు కార్మికులు.

ఆదిలాబాద్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ యంత్ర సామగ్రిని తుక్కు కింద అమ్మేందుకు కేంద్రం టెండర్లు పిలవడంతో సీసీఐను కాపాడుకునేందుకు కార్మికులు అలుపెరగని పోరాటం చేశారు. సుమారు వెయ్యి ఎకరాల భూమి, వేలకోట్ల ఆస్తులు, లక్షల టన్నుల ఉత్పత్తి చేయగల మిషనరీ, దశాబ్దాలకు సరిపడ ముడిసరుకు, వాటర్‌ అండ్ ట్రాన్స్‌పోర్ట్‌ సౌకర్యం, ఇలా అన్నీ ఉన్నా ఫ్యాక్టరీని ఇలా తుక్కు కింద అమ్మేస్తుండటాన్ని జీర్జించుకోలేకపోతున్నారు కార్మికులు. పరిశ్రమ పునరుద్ధరణ కోసం దశాబ్దాల తరబడి తాము చేస్తోన్న పోరాటం బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయిందని ఆవేదన చెందుతున్నారు.