
అన్వేష్ తీరుపై అటు నెటిజన్లు, ఇటు సినీప్రముఖులు సైతం మండిపడుతున్నారు. అటు హిందూ దేవతలు, ఇటు మహిళల పట్ల అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ కేసులో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముందుగా అసలు ఆ వీడియోలు పోస్ట్ చేసింది అన్వేషా.. కాదా అని నిర్ధారణకు వచ్చేందుకు ఇన్స్టాగ్రామ్‌కు పంజాగుట్ట పోలీసులు లేఖ రాశారు. వీడియో పోస్ట్ అయినా యూజర్ ఐడితో పాటు URL ను జోడించి instagramకు లేఖ పంపారు. వీటి వివరాలను తమకు ఇవ్వాల్సిందిగా పంజాగుట్ట పోలీసులు లేఖలో పేర్కొన్నారు.
ఇంస్టాగ్రామ్ నుండి పూర్తిస్థాయిలో వివరాలు వచ్చిన తర్వాత అన్వేష్‌కు పోలీసులు నోటీసులు పంపించనున్నారు. ప్రస్తుతం అన్వేష్ ఇండియాలో లేనట్టుగా పోలీసులు గుర్తించారు. ఇంస్టాగ్రామ్ నుండి రిప్లై వచ్చిన వెంటనే అన్వే్ష్‌కు నోటీసులు జారీ చేసి వివరణ కోరుతామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ సీపీకి విజ్ఞప్తి
ఇదిలా ఉండగా అన్వేష్ తీరుపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నటి కరాటే కళ్యాణి ఘాటుగా స్పందించారు. అన్వేష్ ను ద్వేష ద్రోహితో ఆమె పోల్చారు. అలాగే గతంలో బెట్టింగ్ యాప్స్ అవగాహనలో భాగంగా యూట్యూబర్ అన్వేష్‌తో ప్రస్తుత హైదరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తూ.. భారత దేశ ఔన్నత్యం గురించి అతనికి తెలిసేలా సజ్జనార్ స్టైల్‌లో కోటింగ్ ఇవ్వాలని ఆమె కోరారు. పంజాగుట్టతో పాటు ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోనూ అన్వేష్ పై ఫిర్యాదు చేపిస్తామని ఆమె తెలిపారు.
హిందూ సంఘాల ఆగ్రహం
నాలుగు రోజుల క్రితం అన్వేష్ చేసిన వ్యాఖ్యలుపై అటు హిందూ సంఘాలు సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఎక్కడ దాక్కున్నా సరే అవినాష్‌ను ఇండియాకు రప్పించి అతని శిక్షించాలని కోరుతున్నారు. ప్రస్తుతం అన్వేష్ మొన్న మలేషియాలో ఉన్నాడని నిన్న చైనాలో ఉన్నట్టు తమకు తెలిసిందని వారు ఆరోపిస్తున్నారు.
అన్వేష్‌పై చర్యలకు డిమాండ్
ఒకవైపు హిందూ దేవతలను, మరోవైపు భారతీయ స్త్రీలను అవమానించిన అన్వేష్ పై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. సోషల్ మీడియా అకౌంట్ ఉంటే చాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చు అనే వారికి హైదరాబాద్ పోలీసులు గతంలోనే చాలాసార్లు కోటింగ్ ఇచ్చారు. మరి అన్వేష్ పై కేసు వ్యవహారంలో పోలీసులు ఎలా ముందుకు వెళ్తారో చూడాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.