YS Sharmila: షర్మిల పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు శివారెడ్డి.. వైరల్‌గా మారిన మిమిక్రీ వీడియో..

YS Sharmila: వైఎస్సార్‌టీపీ (YSRTP) అధినేత్రి షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మధ్యలో కరోనా కారణంగా కొన్ని రోజుల పాటు యాత్రను వాయిదా వేసిన షర్మిల ప్రస్తుతం రెండో విడత పాదయాత్రను కొనసాగిస్తున్నారు...

YS Sharmila: షర్మిల పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు శివారెడ్డి.. వైరల్‌గా మారిన మిమిక్రీ వీడియో..

Updated on: Apr 15, 2022 | 5:59 PM

YS Sharmila: వైఎస్సార్‌టీపీ (YSRTP) అధినేత్రి షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మధ్యలో కరోనా కారణంగా కొన్ని రోజుల పాటు యాత్రను వాయిదా వేసిన షర్మిల ప్రస్తుతం రెండో విడత పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 700 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేసుకున్న షర్మిల ప్రస్తుతం తన పాద యాత్రను ఖమ్మం జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా షర్మిల ప్రజాప్రస్థానం శుక్రవారానికి 56వ రోజుకు చేరింది.

శుక్రవారం ఉదయం ఇల్లందు మండలం సుదిమళ్ల క్యాంప్‌ నుంచి మొదలైన పాదయాత్ర జగదాంబ గుంపు, మోదుగుల గూడెం మీదుగా బొజ్జయిగుడెంకు యాత్ర చేరుకుంది. ఈ క్రమంలోనే ఇల్లందు నియోజక వర్గం టేకులపల్లి మండలంలో సినీ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్‌ శివా రెడ్డి షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. తన శివారెడ్డి తన కుటుంబంతో కలిసి పాద యాత్రలో పాల్గొన్నాడు. ఈ సమయంలో అక్కడ ఉన్న అభిమానుల కోరిక మేరకు వైఎస్‌ రాజశేఖ రెడ్డి వాయిస్‌ను మిమిక్రీ చేశారు శివారెడ్డి. తన తండ్రి వాయిస్‌ వినగానే ఒకింత ఎమోషన్‌ గురైన షర్మిల.. శివారెడ్డికి రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే షర్మిల పాదయాత్ర టేకులపల్లి మండలం సాయన్న పేట, 9వ మైల్ తండా, తంగెళ్ల తండా, వెంకటీయ తండా గ్రామాల మీదుగా సాగుతోంది. రాత్రికి వెంకటీయా తండా గ్రామం దాటిన తర్వాత షర్మిల నైట్ హాల్ట్‌ చేయనున్నారు.

 

Also Read: Viral News: ఉచితంగా హెల్మెట్‌ ఇవ్వలేదని షోరూమ్‌ యజమానిపై కేసు నమోదు.. దిగొచ్చిన కంపెనీ..

IndiGo Flight: విమానంలో ప్రయాణికుడి మొబైల్‌ నుంచి మంటలు.. ప్రయాణికుల భయాందోళన

Prabhas: ఎట్టకేలకు పెళ్లిపై స్పందించిన ప్రభాస్.. అప్పుడే అనౌన్స్ చేస్తానంటూ..