Telangana: అటవీ శాఖ హెచ్చరిక.. ఆ ఊర్లోకి పెద్దపులి ఎంట్రీ! ఒక వేళ పులి వస్తే..

గత నెల రోజులుగా భూపాల్ పల్లి, పెద్దపల్లి, అసిఫాబాద్ జిల్లాలలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుండి పెద్ద పులులు తూర్పు అడవి ప్రాంతంలో తిరుగుతున్నాయని రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతానికి ఎవరూ వెళ్ళకూడదని హెచ్చరించారు. అటవీ ప్రాంతంలో వ్యవసాయం చేసే రైతులు..

Telangana: అటవీ శాఖ హెచ్చరిక.. ఆ ఊర్లోకి పెద్దపులి ఎంట్రీ! ఒక వేళ పులి వస్తే..
Tiger Reportedly Enters Peddapalli District

Edited By: Srilakshmi C

Updated on: Mar 09, 2025 | 8:26 PM

పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి వద్ద రోడ్డు దాటుతుండగా పెద్దపులిని చూశారు రైతు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్దపులి రోడ్డు దాటుతున్న ప్రదేశం వద్ద పెద్దపులి పాదముద్రలను గుర్తించి పై అధికారులకు సమాచారం అందించారు సిబ్బంది. జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య సంఘటన స్థలంలో పులి పాదముద్ర చూసి ఆడపులిగా గుర్తించారు. గోపాల్ పూర్ అడవి ప్రాంతం నుంచి కాకర్లపల్లి గ్రామం వైపు వెళ్లినట్లు పులి అడుగులను చూసి అంచనా వేశారు.

జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య మాట్లాడుతూ.. గత నెల రోజులుగా భూపాల్ పల్లి, పెద్దపల్లి, అసిఫాబాద్ జిల్లాలలో పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలిపాడు. గత కొన్ని సంవత్సరాల నుండి పెద్ద పులులు తూర్పు అడవి ప్రాంతంలో తిరుగుతున్నాయని రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతానికి ఎవరూ వెళ్ళకూడదని హెచ్చరించారు. అటవీ ప్రాంతంలో వ్యవసాయం చేసే రైతులు ఉచ్చులు పెట్టడం, కరెంట్ వైర్లు పెట్టడం లాంటిది చేసి పెద్దపులికి ఏదైనా జరిగితే, ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

వ్యవసాయదారులు పశువుల కాపరులు అటవీ ప్రాంతానికి వెళ్లకుండా అటవీశాఖ అధికారుల సూచనలు పాటిస్తూ కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇటీవల ఈ ప్రాంతంలో పెద్దపులిల సంచారం పెరిగింది. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి ఈ పులులు వస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.