NIT Warangal: నకిలీ ర్యాంక్ కార్డుతో వరంగల్ NITలో ప్రవేశానికి యత్నించిన విద్యార్థి.. చివరికి ఊహించని పరిణామం
డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ ఇలాంటి కోర్సులు ఏవైనా పుర్తి చేయాలంటే కనీసం రెండు నుంచి నాలుగేళ్లు పడుతుంది. ఆ తర్వాత వారు చదివిన విశ్వవిద్యాలయాల నుంచి సర్టిఫికేట్ వస్తుంది. అయితే ఇలాంటివి ఏమి లేకుండానే కొర్సును బట్టి సొమ్మును తీసుకుంటూ ఫేక్ సర్టిఫేకట్లను చేతిలో పెడుతున్నాయి కొన్ని ముఠాలు. ఇలాంటి కేటుగాళ్లను పట్టుకునేందుకు పోలీసుల ఎన్నో ప్రయత్నాలు చేసి అరెస్టులు చేస్తున్నారు.
డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ ఇలాంటి కోర్సులు ఏవైనా పుర్తి చేయాలంటే కనీసం రెండు నుంచి నాలుగేళ్లు పడుతుంది. ఆ తర్వాత వారు చదివిన విశ్వవిద్యాలయాల నుంచి సర్టిఫికేట్ వస్తుంది. అయితే ఇలాంటివి ఏమి లేకుండానే కొర్సును బట్టి సొమ్మును తీసుకుంటూ ఫేక్ సర్టిఫేకట్లను చేతిలో పెడుతున్నాయి కొన్ని ముఠాలు. ఇలాంటి కేటుగాళ్లను పట్టుకునేందుకు పోలీసుల ఎన్నో ప్రయత్నాలు చేసి అరెస్టులు చేస్తున్నారు. అయినా కూడా మళ్లీ కొత్త ముఠాలు పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది. ఈమధ్యకాలంలో రాష్ట్రంలో నకిలీ సర్టిఫికేట్లు సృష్టించి.. చేసే మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా వరంగల్‌లో నీట్‌లోని నకలీ ర్యాంకు కార్డుతో సీటు పొందడానికి ఓ విద్యార్థిని ప్రయత్నించడం కలకలం రేపుతోంది. అధికారులు తనిఖీలు చేయగా.. ఆ యువతి నకిలీ ర్యాంకు కార్డు ఉదంతం బయటికి వచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రకు చెందిన ఓ యువతికి ర్యాంకు ఉన్నప్పటికీ కూడా నకిలీ కార్టు సృష్టించుకుని, నీట్‌లో ప్రవేశం పొందడానకి ప్రయత్నాలు చేసింది. విద్యార్థిని ర్యాంక్ కార్డు.. నీట్ అలాట్‌మెంట్ పత్రాలు నకిలీవిగా ఉన్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. ఇక ఆ యువతికి 5 లక్షల ర్యాంకు వస్తే.. దాన్ని 50 వేలుగా మార్చుకొని ప్రవేశం పొందడానికి సిద్ధమైపోయింది. నీట్ అధికారుల విచారణ చేయగా.. ఆమె తన పత్రాలను ఫోర్జరీ చేసినట్లు అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది. రూర్కెలా ప్రాంతంలో కూడా ముగ్గురు విద్యార్థులు.. ఇదే తరహాలో సీటు పొందడానకి ప్రయత్నించారు. ఇలా అనేక చోట్ల ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడంతో.. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న కుంభకోణంగా కనిపిస్తోంది. నకిలీ పత్రాలతో ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో సీట్లు పొందడం వెనక పెద్ద మూఠానే ఉన్నట్లు తెలుస్తోంది.
డబ్బులకు కక్కుర్తి పడుతున్న మూఠా సభ్యులు.. విద్యార్థులతో కుమ్మక్కై.. ఫేక్ ర్యాంక్ కార్డులు అలాగే ఫేకి అలాట్‌మెంట్ పత్రాలను సృష్టిస్తున్నారు. మరో విషయం ఏంటంటే సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు దీనిపై సమగ్రంగా విచారణ చేస్తే.. అక్రమంగా జరిగినటువంటి ప్రవేశాలు మరిన్ని బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలాంటి మోసాలను కట్టడి చేస్తేనే.. టాలెంట్ ఉన్న విద్యార్థులకు అన్యాయ జరగకుండా ఉంటుంది. ఇదిలా ఉండగా దేశంలో వరంగర్ నిట్‌కు మంచి గుర్తింపు ఉంది. కొందరు విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు వచ్చినా కూడా వాటిని వదులుకోని ఇక్కడ సీఎస్‌ఈ, ఈసీసీ, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లలో చేరిపోతారు. ఇందులో సీటు వస్తే ఉద్యోగాలు ఖాయమని విద్యార్థులు అనుకుంటారు. ఇదిలా ఉండగా 2021లో ఇక్కడ చదివిన వెయ్యి మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. అత్యధిక వార్షిక ప్యాకేజీ.. 62.5 లక్షల రూపాయలు కావడం విశేషం. అయితే ఇలా ఫేక్ సర్టిఫికేట్లతో ప్రవేశం పొందకుండా అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..