
యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామంలో శుక్రవారం షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రోజులానే కల్లు తీసేందుకు తాటి చెట్టు ఎక్కిన గీతా కార్మికుడు మాసయ్య గౌడ్ పెను ప్రమాదంలో చిక్కుకున్నాడు. మోకు జారిపోవడంతో తలకిందులా వేలాడపడ్డాడు. సుమారు 5 గంటలపాటు తాటి చెట్టు పైనే వేలాడుతూ నరకయాతన అనుభవించాడు.
ప్రమాదంలో చిక్కుకున్న మాసయ్య గౌడ్ ను తాళ్ల సాయంతో కాపాడే పయత్నం చేశారు స్థానికులు. చెట్టుపై నుంచి కిందకు దించేందుకు నానా కష్టాలు పడ్డారు. అయినా వారి ప్రయత్నం ఫలించకపోవడంతో చివరికి పోలీస్, ఫైర్ సిబ్బందికి సమచారం అందించారు. వెంటనే స్పందించిన యాదాద్రి పోలీస్ అధికారులు క్రేన్, తాళ్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో మరో ఇద్దరిని తాటి చెట్టుపైకి పంపి చివరకు గీతాకార్మికుడు మూసయ్య గౌడ్ ను జాగ్రత్తగా కిందకు దింపారు. అప్పటికే సృహ కోల్పోయిన మూసయ్యను మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ సాయంతో హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం మూసయ్యకు చికిత్స కొనసాగుంది. మూసయ్యకు జరిగిన పెను ప్రమాదంతో ఒక్కసారి షాక్‌కు గురయ్యారు స్థానికులు. గీతా కార్మికుల కష్టాలను తీర్చాలని వేడుకుంటున్నారు.
కల్లు తీసేందుకు తాటి చెట్ల పైకి ఎక్కే గీత కార్మికులు జాగ్రత్తగా ఉండాలని.. ముందే సామాగ్రి అంతా చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో భారీ వర్షాలు కురవడంతో.. ఉపాధి కోల్పోయి గీత కార్మిక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొటున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..