దురదృష్టం అంటే ఇదే.. రూ. 200 బిర్యాని కోసం వెళితే.. లక్ష రూపాయల బైక్ గోవిందా..!

బిర్యాని అంటే కొందరికి ఎంతో ఇష్టం.. దగ్గరలో రెస్టారెంట్, హోటల్స్ కు వెళ్ళి రుచికరమైన బిర్యాని అరగిస్తుంటారు. ఒక్కో చోట ఒక్కో ఐటమ్ ఫేమస్.. ఈ క్రమంలోనే ఓ యువకుడు రూ. 200 రూపాయలకే లభిస్తున్న రుచికరమైన బిర్యానిని అస్వాదించేందుకు ఒక రెస్టారెంట్ కు వెళ్లారు. రెండు వందల రూపాయలు బిర్యానిపై ఆశపడితే లక్ష రూపాయలు విలువ చేసే బైక్ పోయింది.

దురదృష్టం అంటే ఇదే.. రూ. 200 బిర్యాని కోసం వెళితే.. లక్ష రూపాయల బైక్ గోవిందా..!
Bike Stolen

Edited By:

Updated on: Jan 29, 2026 | 1:30 PM

బిర్యాని అంటే కొందరికి ఎంతో ఇష్టం.. దగ్గరలో రెస్టారెంట్, హోటల్స్ కు వెళ్ళి రుచికరమైన బిర్యాని అరగిస్తుంటారు. ఒక్కో చోట ఒక్కో ఐటమ్ ఫేమస్.. ఈ క్రమంలోనే ఓ యువకుడు రూ. 200 రూపాయలకే లభిస్తున్న రుచికరమైన బిర్యానిని అస్వాదించేందుకు ఒక రెస్టారెంట్ కు వెళ్లారు. రెండు వందల రూపాయలు బిర్యానిపై ఆశపడితే లక్ష రూపాయలు విలువ చేసే బైక్ పోయింది.

దురదృష్టం అంటే ఇదే.. రుచికరమైన బిర్యాని తిందామని వెళితే.. తిరిగి వచ్చేసరికి బైకు చోరీకి గురైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. సత్తుపల్లిలోని ఒక రెస్టారెంట్ ముందు బైకును పార్క్ చేసిన ఓ యువకుడు, బిర్యాని తినేందుకు రెస్టారెంట్ లోకి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి తన బైక్ కనిపించలేదు. దీంతో షాక్ కు గురైన బాధితుడు రెస్టారెంట్ యజమాని సహకారంతో సీసీ కెమెరా పుటేజీ లో వీడియోలు పరిశీలించాడు. దీంతో కనిపించిన సీన్ చూసి షాక్ అయ్యాడు.

ఒక దుండగుడు ముఖానికి మాస్క్ వేసుకుని బైకు ను దొంగిలించి తీసుకెళ్లి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా బైక్ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇష్టమైన బిర్యాని తిన్నానని సంతోష పడే లోపే షాకింగ్ ఘటన జరిగింది.

వీడియో చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..