Hyderabad: కవాడిగూడలో 13 ఏళ్ల బాలిక మిస్సింగ్.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో.. కలకలం రేపుతోన్న ఘటన..

హైదరాబాద్ లోని కవాడిగూడలో 13 ఏళ్ల బాలిక అదృశ్యం కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న బాలిక కనిపించకుండా పోవడం హాట్ టాపిక్ గా మారింది. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లడంతో బాలిక ఇంట్లోనే...

Hyderabad: కవాడిగూడలో 13 ఏళ్ల బాలిక మిస్సింగ్.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో.. కలకలం రేపుతోన్న ఘటన..
Girl MIssing

Updated on: Dec 28, 2022 | 8:20 AM

హైదరాబాద్ లోని కవాడిగూడలో 13 ఏళ్ల బాలిక అదృశ్యం కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న బాలిక కనిపించకుండా పోవడం హాట్ టాపిక్ గా మారింది. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లడంతో బాలిక ఇంట్లోనే ఉంటోంది. మధ్యాహ్నం 12 గంటలకు బాలికకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో.. అతను భయాందోళనకు గురయ్యాడు. వెంటనే ఇంటికి వచ్చి చూడగా ఆమె ఇంట్లో కనిపించలేదు. చుట్టుపక్కలా వెతికినా లాభం లేకపోవడంతో పోలీసు లకు ఫిర్యాదు చేశాడు పేరెంట్స్. సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య బాలిక ఫోన్ సిగ్నల్స్ నాగోల్ సమీపంలోని స్నేహపురి కాలనీలో చూపించడంతో పోలీసులు, తల్లిదండ్రలు అక్కడికి వెళ్లారు. బాలిక వెళ్లిన రూట్లో సీసీ ఫుటేజ్ ను పోలీసులు చెక్ చేస్తున్నారు. చిన్నారి మానసిక పరిస్థితి కూడా సరిగ్గా ఉండక పోవడంతో.. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమార్తెను త్వరగా గుర్తించాలని పోలీసులను కోరుతున్నారు.

Girl Missing

కాగా.. కొద్ది రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. సికింద్రాబాద్ పరిధిలోని మహంకాళి ప్రాంతంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ కు గురైంది. కూతురు కనిపించకుండపోవడంతో తల్లిదండ్రులు అంతటా వెతికారు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు కిడ్నాప్ కు గురైన ఆ బాలికను రక్షించి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే బాలికను కిడ్నాప్ చేసింది ఎవరో తెలిసి ఆ చిన్నారి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తి పేరు రాము అని తెలుసుకున్నారు. సిద్దిపేట ప్రాంతానికి చెందిన అతను కొంత కాలంగా మహంకాళి పరిధిలోని ఓ హోటల్ లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ బాలికను కిడ్నాప్ చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక కూతురు తమ వద్దకు చేరడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..