Road Accident: వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు.. ముగ్గురి దుర్మరణం

మియాపూర్‌ డిపోకు చెందిన గరుడ బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన ముగ్గురు బస్సులో ప్రయాణిస్తున్న వారే. మృతుల్లో డ్రైవర్‌, క్లీనర్‌, ఓ ప్రయాణికుడు ఉన్నారు.

Road Accident: వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు.. ముగ్గురి దుర్మరణం
Road Accident

Updated on: Nov 21, 2022 | 4:52 AM

వనపర్తి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తకోట మండలంలోని జాతీయరహదారిపై ముమ్మాళ్లపల్లి వద్ద చెరకులోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి గరుడ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరో16 మందికి గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారు. మియాపూర్‌ డిపోకు చెందిన గరుడ బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన ముగ్గురు బస్సులో ప్రయాణిస్తున్న వారే. మృతుల్లో డ్రైవర్‌, క్లీనర్‌, ఓ ప్రయాణికుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లో వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా రోడ్డు ప్రమాదంతో ముమ్మాళ్లపల్లి నుంచి అమడబాకుల వరకు సుమారు నాలుగు కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వాహనాలు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us