మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో దారుణం వెలుగుచూసింది. అమ్మ కోసం కుమారుడు హంతకుడు అయ్యాడు. 14 ఏళ్లుగా అతడి తల్లి కనిపించకుండాపోయింది. చాలాచోట్ల వెతికాడు కానీ ఆచూకి దొరకలేదు. అమ్మ ప్రేమను పొందలేకపోతున్నానన్న బాధ అతడిని నిత్యం వెంటాడేది. అయితే అనూహ్య రీతిలో తన తల్లి వేరొక వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు గుర్తించాడు కుమారుడు. అందుకు ఫేస్‌బుక్ సాయపడింది. తన తల్లి సహజీవనం చేస్తున్న వ్యక్తి మేడిపల్లికి చెందిన వెంకట మూర్తి(47)గా గుర్తించాడు. వెళ్లి అమ్మకు నచ్చజెప్పి ఇంటికి తీసుకువెళ్లేందుకు యత్నించాడు. కానీ తాను రానని.. సహజీవనం చేస్తున్న వ్యక్తితో ఉంటానని ఆమె తెగేసి చెప్పింది. ఎన్ని ప్రయత్నాలు చేసి ససేమేరా అన్నది.
దీంతో ఆ యువకుడు కోపోద్రిక్తుడు అయ్యాడు. దీనంతటికి కారణం.. వెంకట మూర్తిగా భావించి.. అతడిపై పగ పెంచుకున్నాడు. పక్కా ప్లాన్ వేసి అతడిని కత్తితో పొడిచి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు పీర్జాదిగూడలోని ఓ వృద్ధాశ్రమంలో కేర్‌టేకర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు శ్రీకాంత్ రెడ్డి (26) ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన వ్యక్తి నిర్ధారించారు.
ఇప్పుడు తాను హంతకుడు అయ్యాడు. జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అవతల ఆ మహిళ కూడా ఒంటరి అయ్యింది. ఒక్క తప్పు.. 2 కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం