AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీజే సౌండ్‌తో జాగ్రత్త.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంటర్ విద్యార్థి.. ఆ తర్వాత..

నారాయణపేట జిల్లా కోస్గిలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్నేహితుడి ఇంట్లో పెళ్లి వేడుక సందర్భంగా డీజే పాటలకు డ్యాన్స్ చేస్తుండగా 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి రవితేజ ఒక్కసారిగా కుప్పకూలాడు. స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

డీజే సౌండ్‌తో జాగ్రత్త.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంటర్ విద్యార్థి.. ఆ తర్వాత..
Intermediate Student Death
Shaik Madar Saheb
|

Updated on: Sep 02, 2026 | 9:31 AM

Share

అంతా పెళ్లి సందడిలో ఉన్నారు.. స్నేహితులు, కుటుంబసభ్యులతో ఇల్లు సందడిగా మారింది.. మంచిగా డీజే పెట్టి.. పాటలతో అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే.. ఊహించని ఘటన చోటుచేసుకుంది.. డీజే సౌండుకు డ్యాన్స్‌ చేస్తూ ఇంటర్‌ విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలాడు.. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు అతన్ని .. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే.. మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. స్నేహితుని ఇంట్లో పెళ్లి సందడిలో డీజే సౌండుకు డ్యాన్స్‌ చేస్తూ ఇంటర్‌ విద్యార్థి మృతి చెందిన ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లాలోని కోస్గిలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. నారాయణపేట కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లికి చెందిన దస్తయ్య, లక్ష్మీ దంపతులకు కుమారుడు రవితేజ (17), కుమార్తె ఉన్నారు. రవితేజ.. ఇంటర్ చదువుతున్నాడు.. ఈ క్రమంలోనే.. స్నేహితుని ఇంట్లో పెళ్లి ఉండటంతో సోమవారం రాత్రి రవితేజ అతని ఇంటికి వెళ్లాడు. స్నేహితులంతా కలిసి ఈ సమయంలో సందడి చేస్తూ ఎంజాయ్ చేశారు.

ఇదే సమయంలో డీజే పాటలు పెట్టి డ్యాన్స్‌ చేశారు. అయితే.. డీజే సౌండ్ కు రవితేజ హఠాత్తుగా కుప్పకూలాడు. స్పృహ తప్పి పడిపోయిన రవితేజను స్నేహితులు, స్థానికులు వెంటనే.. కోస్గి ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో రవితేజ కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అప్పటివరకు తమతో సంతోషంగా గడిపిన యువకుడు.. గుండెపోటుతో చనిపోవడం తీవ్రంగా కలిచివేసింది.

వీడియో చూడండి..

కాగా.. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగిన సందర్భాలున్నాయి.. అందుకే.. డీజే సౌండ్స్ విషయంలో జాగ్రత్త అంటూ పలువురు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..