ఓర్నాయనో.. మహిళా రైతును అమాంతం మింగబోయిన కొండచిలువ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో పొలం పనులు చేస్తున్న మహిళా రైతుపై 15 అడుగుల భారీ కొండచిలువ దాడి చేసి మింగేందుకు ప్రయత్నించింది. బాధితురాలి అరుపులు విన్న సహచర రైతులు, కూలీలు వెంటనే స్పందించి కొండచిలువను తరిమికొట్టి ఆమె ప్రాణాలు కాపాడారు. అనంతరం పామును గోనె సంచిలో బంధించి బాధితురాలితో కలిసి ఆస్పత్రికి తరలించారు.

ఓర్నాయనో.. మహిళా రైతును అమాంతం మింగబోయిన కొండచిలువ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Python Attack

Edited By:

Updated on: Aug 06, 2026 | 8:00 AM

వ్యవసాయ క్షేత్రంలో పొలం పనులు చేస్తున్న ఓ మహిళా రైతుపై 15 అడుగుల భారీ కొండ చిలువ దాడి చేసింది. ఆ తర్వాత మింగేందుంకు ప్రయత్నించింది.. పైథాన్ దాడితో ఒక్కసారిగా వణికిపోయింది. ఆమె అరుపులు విన్న సహచర రైతులు, కూలీలు వెంటనే అప్రమత్తమై మహిళ ప్రాణాలు కాపాడారు. అనంతరం ఆ కొండచిలువను కొట్టి గోనెసంచిలో కట్టి బాధిత మహిళతో సహా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కంచనపళ్లి గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. స్వప్న అనే మహిళ తన వ్యవసాయ క్షేత్రం వద్ద పొలం పనులలో నిమగ్నమయ్యారు. చెట్ల పొదల నుండి పొలంలోకి వచ్చిన భారీ కొండచిలువ దాడి చేసింది. సుమారు 15 అడుగుల పొడవు కలిగిన కొండచిలువ స్వప్న పై దాడి మింగే ప్రయత్నం చేసింది.

కొండచిలువ నుండి ప్రాణాలు కాపాడుకోవడం కోసం బాధిత మహిళా రైతు కేకలు వేయడంతో అక్కడే ఉన్న సహచర కూలీలు, రైతులు వెంటనే స్పందించారు.. స్వప్న అరుపులు గమనించి అక్కడకు పరుగులు పెట్టారు. కొండచిలువ పై దాడిచేసి ఆ మహిళకు విముక్తి కల్పించారు. అయితే.. ఎలాంటి కొండచిలువ కాటేసిందో తెలిస్తే వైద్యం సులభంగా ఉంటుందనే ఆలోచనతో.. దానిని బస్తాలో బంధించి జనగామలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం స్వప్న ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుంది.

వీడియో చూడండి..

కొండచిలువ దాడికి గురైన స్వప్నకు ప్రాధమిక చికిత్స అందించిన వైద్యులు.. కొండచిలువ గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.. ఈ పాములో ఎలాంటి విషము ఉండదు కానీ.. మనిషిని అయినా పశువునైన మింగేయగలదని, వీటి నుండి జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ బిక్షపతి అవగాహన కల్పించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us