పెరుగు ఎక్కువ కాలం తాజాగా ఉండాలా..? అదిరిపోయే కిచెన్‌ టిప్స్‌!

August 26, 2026

Subhash

దీర్ఘకాలం పెరుగు ఫ్రెష్‌గా ఉండాలంటే.. ఈ 7 చిట్కాలు పాటించండి. పెరుగు త్వరగా పుల్లగా మారకుండా ఉండేందుకు ఈ సింపుల్ టిప్స్ మీకు ఉపయోగపడతాయి.

పెరుగు ఫ్రెష్‌గా..

పెరుగులో చిన్న కొబ్బరి ముక్కను వేసి ఉంచితే ఎక్కువసేపు ఫ్రెష్‌గా ఉండేందుకు సహాయపడుతుంది. చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది.

కొబ్బరి ముక్క వేయండి

కాడతో ఉన్న పచ్చిమిర్చిని బాగా కడిగి పెరుగులో ఉంచితే పుల్లబడే ప్రక్రియ కొంత ఆలస్యం అవుతుంది. దీని వల్ల పెరుగు తాజాగా  ఉంటుంది.

పచ్చిమిర్చితో పులుపు ఆలస్యం

ప్లాస్టిక్‌ కంటే గాలి చొరబడని గాజు, సిరామిక్ లేదా మట్టి పాత్రలు ఉపయోగించడం మంచిది. దీంతో తాజాగా ఎక్కువ కాలం పాటు ఉంటుంది.

సరైన పాత్రలోనే నిల్వ చేయండి

పెరుగును నేరుగా సూర్యరశ్మి తగలని చల్లని ప్రదేశంలో ఉంచండి. ఎక్కువకాలం కావాలంటే ఫ్రిజ్‌లో భద్రపరచడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

చల్లని ప్రదేశంలో ఉంచండి

పెరుగు తీసుకునేటప్పుడు ఎప్పుడూ శుభ్రమైన, పొడి స్పూన్ ఉపయోగించండి. తడి స్పూన్‌తో పెరుగు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇలా చేయకపోవడం మంచిది.

శుభ్రమైన స్పూన్‌నే వాడండి

పెరుగు తయారీకి ఎప్పుడూ తాజా పాలను ఉపయోగించడం మంచిది. అలాగే పాత పెరుగును కొత్త పెరుగుతో కలపడం వల్ల పులుపు పెరిగే అవకాశం ఉంది.

పాత పెరుగును కలపొద్దు

పెరుగు ఇతర ఆహార పదార్థాల వాసనను త్వరగా పీల్చుకుంటుంది. అందుకే ఘాటైన వాసన ఉన్న ఆహారాలకు దూరంగా, మూతపెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయండి.

 ఇతర ఆహారాలకు