Zee5: అమెరికాలో మీకు ఫ్రెండ్స్ ఉన్నారా.? రివార్డ్స్ పొందే అవకాశం…
జీ5 గ్లోబల్ రిఫర్ అండ్ ఎర్న్ పేరుతో దీనికి శ్రీకారం చుట్టింది. భారత్‌కు చెందిన వ్యక్తులు అమెరికాలో ఉంటున్న తమ మిత్రులు లేదా కుటుంబసభ్యులకు రిఫర్ చేయడం వల్ల డబ్బులు సంపాదించే అవకాశాన్ని కల్పించారు.అయితే ఇందుకోసం మీరు కచ్చితంగా జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది..
ఓటీటీ సేవల విస్తృతి క్రమంగా పెరుగుతూపోతోంది. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా నచ్చిన భాషలో కంటెంట్‌ను వీక్షించే అవకాశం లభించింది. దీంతో ఓటీటీ సేవల మధ్య పోటీ కూడా సహజంగానే పెరిగింది. సబ్‌స్క్రైబర్స్‌ను పెంచుకునే క్రమంలో రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5 సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. జీ5ని రిఫర్ చేయడం ద్వారా రివార్డ్స్ పొందే అవకాశం కల్పించింది.
జీ5 గ్లోబల్ రిఫర్ అండ్ ఎర్న్ పేరుతో దీనికి శ్రీకారం చుట్టింది. భారత్‌కు చెందిన వ్యక్తులు అమెరికాలో ఉంటున్న తమ మిత్రులు లేదా కుటుంబసభ్యులకు రిఫర్ చేయడం వల్ల డబ్బులు సంపాదించే అవకాశాన్ని కల్పించారు.అయితే ఇందుకోసం మీరు కచ్చితంగా జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా అమెరికాలో ఉంటున్న స్నేహితులు, కుటుంబ సభ్యులకు జీ5ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని రిఫర్ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ వారు జీ5కి సబ్‌స్క్రైబ్ చేసుకుంటే.. ఒక్కో సబ్‌స్క్రిప్షన్‌కు గానూ మీకు రూ.500 విలువైన అమెజాన్ గిఫ్ట్ వోచర్‌ను మీరు గెలుచుకోవచ్చు. ఎంత మంది సబ్‌స్క్రైబ్ చేసుకుంటే అంత మొత్తం సంపాదించొచ్చు. అంతేకాదు అమెరికాలో ఉంటున్న వారు సబ్‌స్క్రైబ్ చేసకున్న వారూ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌పై 50 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో రిఫర్ చేసిన వారితో పాటు, సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి లబ్ధిచేకూరనుంది.
ఇందుకోసం ముందుగా ZEE5.com/Referral లేదా జీ5.కామ్ హోమ్ పేజీలో రిఫర్ అండ్ ఎర్న్ బటన్ క్లిక్ చేయాలి. దీంతో వెంటనే ఒక యునిక్ రిఫరల్ లింక్ జనరేట్ అవుతుంది. దాన్ని జీ5 గ్లోబల్ కమ్యూనిటీలో చేరాలంటూ అమెరికాలోని మీ స్నేహితులకు, బంధువులకు పంపించాలి. ఒకవేళ వారు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే మీకు రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్ లభిస్తుంది. దాంతో అమెజాన్‌లో మీకు నచ్చిన వస్తువును కొనుగోలు చేయొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..