Youtube search tips: యూట్యూబ్‌లో ఇలా సెర్చ్ చేయొచ్చని చాలామందికి తెలీదు!

యూట్యూబ్‌లో కొన్ని లక్షల వీడియోలు ఉంటాయి. వీటిలో మీకు కావాల్సిన వీడియోని కచ్చితంగా వెతకడం కోసం కొన్ని సీక్రెట్ టూల్స్ ఉన్నాయని మీకు తెలుసా? చాలామంది సెర్చ్ బార్ లోకి వెళ్లి నేరుగా వీడియో కోసం టైప్ చేస్తుంటారు. అలా కాకుండా కొన్ని కోడ్స్ వాడి సెర్చ్ చేస్తే.. వీడియో రిజల్ట్స్ ఇంకా బెటర్ గా వస్తాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

Youtube search tips: యూట్యూబ్‌లో ఇలా సెర్చ్ చేయొచ్చని చాలామందికి తెలీదు!
Youtube Search Tools

Updated on: Sep 19, 2025 | 4:15 PM

యూట్యూబ్‌లో ప్రతి నిమిషానికి కొన్ని వేల వీడియోలు అప్‌లోడ్‌ అవుతూ ఉంటాయి. అందుకే ఇన్ని వీడియోల మధ్యలో మనకు కావాల్సిన వీడియో వెతకడం కోసం యూట్యూబ్ కొన్ని సెర్చ్ టూల్స్ ను అందుబాటులో ఉంచింది. వీటి గురించి చాలామందికి తెలీదు.  యూట్యూబ్‌లో స్మార్ట్ గా సెర్చ్ చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

టైమ్ లైన్

మీకు ఈ వారం లేదా ఈ నెలలో అప్‌లోడ్ అయిన వీడియోలు కావాలంటే యూట్యూబ్‌లో  సెర్చ్‌ బాక్స్‌లో కావాల్సిన టాపిక్ టైప్ చేశాక  ‘ఈ వారం’ లేదా ‘ఈ నెల’ అని కూడా ఎంటర్‌ చేయాలి.  ఉదాహరణకు ‘ తెలుగు సాంగ్స్ దిస్ వీక్(telugu songs this week)’ అని టైప్ చేస్తే ఈ వారం అప్‌లోడ్ అయిన సాంగ్ వీడియోలన్నీ కనిపిస్తాయి. ఇలాగే ట్రైలర్లు, న్యూస్ వీడియోలు కూడా వెతకొచ్చు.

సింబల్స్

యూట్యూబ్‌లో ఏదైనా ఒక పదం టైప్ చేసినప్పుడు ఆ పదానికి దగ్గరగా ఉన్న అన్ని వీడియోలు కనిపిస్తాయి. ఉదాహరణకు.. మీరు ఓజీ ట్రైలర్ అని టైప్ చేస్తే.. ట్రైలర్ తో పాటు ట్రైలర్ రివ్యూలు కూడా కనిపిస్తాయి. అందుకే ‘ఓజీ ట్రైలర్ – రివ్యూ’ అని టైప్ చేస్తే.. సెర్చ్ రిజల్ట్స్ నుంచి రివ్యూ వీడియోలు ఎలిమినేట్ అవుతాయి.  అలాగే ‘+’  ఉపయోగించి రెండు కీవర్డ్స్‌ను కలిపి సెర్చ్ చేయొచ్చు. ‘ఓజీ ట్రైలర్+ టీవీ9’ అని కలిపి సెర్చ్ చేస్తే.. ఈ రెండింటి కాంబినేషన్ లో ఉన్న వీడియోలు వస్తాయి.  అంటే ఓజీ ట్రైలర్ తో పాటు ట్రైలర్ గురించి టీవీ9లో వచ్చిన న్యూస్ వీడియోలు కూడా కనిపిస్తాయి.

సెర్చ్ ఫిల్టర్స్

యూట్యూబ్‌లో ఉండే ఫిల్టర్ ఆప్షన్ ద్వారా మరింత స్మార్ట్ గా సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ బార్ లో మీకు కావాల్సిన టాపిక్ టైప్ చేసి ఎంటర్ చేశాక పక్కన ఉండే త్రీ డాట్స్ పై క్లిక్ చేసి సెర్చ్ ఫిల్టర్స్ పై క్లిక్ చేయాలి. అక్కడ అప్‌లోడ్ టైం, వ్యూస్, వీడియో క్వాలిటీ, వీడియో టైప్, డ్యూరేషన్  ఇలా రకరకాలుగా సెర్చ్ రిజల్స్ట్‌ను ఫిల్టర్ చేయొచ్చు.

ఇక వీటితోపాటు యూట్యూబ్‌లో పాట పేరు పక్కన కామా(,) పెట్టి పాడినవారి పేరు టైప్‌ చేస్తే కవర్ సాంగ్స్ కాకుండా ఒరిజినల్ సాంగ్స్ మాత్రమే కనిపిస్తాయి. యూట్యూబ్‌లో ‘ఇన్‌టైటిల్’ అనే కమాండ్ ఉపయోగించి వీడియో టైటిల్స్‌ను నేరుగా వెతకొచ్చు. సెర్చ్ బాక్స్‌లో intitle: “modi speech”  అని టైప్ చేస్తే ఆ పదం ఉన్న వీడియో టైటిల్స్  మాత్రమే కనిపిస్తాయి.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి