YouTube: హమ్మింగ్‌తో హమ్మ, హమ్మ.. యూట్యూబ్‌లో ప్రయోగాత్మక ఫీచర్ వచ్చింది చూశారా!

యూ ట్యూబ్ వినియోగం ఇక మరింత సులభతరం కానుంది. మీకు నచ్చిన పాటను కేవలం హమ్ చేస్తే చాలు ఆ పాట యూ ట్యూబ్ లో ప్లే అయిపోతుంది. దీంతో పాటు పాట పాడినా, లేదా రికార్డు చేసినా కూడా యూ ట్యూబ్ లో అది వచ్చేలా సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేశారు. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్ కు అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

YouTube: హమ్మింగ్‌తో హమ్మ, హమ్మ.. యూట్యూబ్‌లో ప్రయోగాత్మక ఫీచర్ వచ్చింది చూశారా!
Youtube
Follow us
Madhu

|

Updated on: Aug 25, 2023 | 5:00 PM

గూగుల్ అంటేనే ఆవిష్కరణ. ఎప్పుడూ ఒకే తరహాలో ఉండదు. ఇప్పటికప్పుడు సరికొత్త విధానాలు, అత్యాధునిక ఫీచర్లను తీసుకొస్తుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తన అన్ని ప్లాట్ ఫారంలోనూ కొత్త అప్ డేట్లను ప్రవేశపెడుతోంది. ఇదే క్రమంలో ఇప్పుడు ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ యూ ట్యూబ్ లోనూ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకూ మీరు యూ ట్యూబ్ లో వీడియోలు చూడాలంటే మీరు ఏం చేసే వారు సెర్చ్ బార్ లోకి వెళ్లి మీకు కావాల్సిన దానిని టైప్ చేయడమో లేదా స్పీకర్ బటన్ ప్రెస్ చేసి మీకు అవసరమైన వీడియో కోసం కమాండ్ ఇచ్చేవారు. వీడియో పేరు గానీ, లేదా సినిమా పేరు, పాటను లిరిక్స్, హీరోలు ఇతర పాత్రధారుల పేర్లను గానీ దానిలో టైప్ చేస్తేగానీ ఆ పాటలు, వీడియో మనకు ఫీడ్ రాదు. ఇకపై ఆ అవసరం లేకుండానే యూ ట్యూబ్ ఓ ప్రయోగాత్మక ఫీచర్ ను తీసుకొచ్చింది. అదేమిటంటే మీకు నచ్చిన పాటను కేవలం హమ్ చేస్తే చాలు పాట ప్లే అయ్యేటట్లు యూ ట్యూబ్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పాటను హమ్ చేస్తే చాలు..

యూ ట్యూబ్ వినియోగం ఇక మరింత సులభతరం కానుంది. మీకు నచ్చిన పాటను కేవలం హమ్ చేస్తే చాలు ఆ పాట యూ ట్యూబ్ లో ప్లే అయిపోతుంది. దీంతో పాటు పాట పాడినా, లేదా రికార్డు చేసినా కూడా యూ ట్యూబ్ లో అది వచ్చేలా సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేశారు. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్ కు అందుబాటులో ఉంది. మీ కావాల్సిన పాటను హమ్మింగ్, సింగింగ్, రికార్డింగ్ చేయడం ద్వారా మీరు పొందొచ్చు.

ట్రయల్ వెర్షన్..

ఈ కొత్త ఫీచర్ ను యూ ట్యూబ్ ట్రయల్స్ చేస్తుంది. కొంతమంది వినియోగదారులకు మాత్రమే దీనిని అందుబాటులో ఉంచుతోంది. ఈ ట్రయల్ యాక్సెస్ ఉన్న వారు యూ ట్యూబ్ వాయిస్ సెర్చ్ లోకి వెళ్లి మూడు సెకన్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధిలో పాటను హమ్ చేయడం, పాడడం లేదా రికార్డ్ చేయడం ద్వారా అది ప్లాట్‌ఫారమ్ మెలోడీని నేర్పుగా గుర్తిస్తుంది. తదనంతరం కోరిన పాటతో కూడిన సంబంధిత యూ ట్యూబ్ వీడియోలను వినియోగదారుని అందిస్తుంది. ఈ కంటెంట్‌లో అధికారిక సంగీత వీడియోలు, వినియోగదారు రూపొందించిన సమర్పణలు లేదా షార్ట్‌లు ఉంటాయి. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

ఆసక్తికరంగా, యూ ట్యూబ్ నుంచి వచ్చిన ఈ తాజా ప్రయోగం నిర్దిష్ట వినియోగదారుల మధ్య పరిచయాన్ని కలిగించవచ్చు. 2020లో, యూ ట్యూబ్ మాతృ సంస్థ అయిన గూగుల్, గూగుల్ యాప్, గూగుల్ సెర్చ్ విడ్జెట్, గూగుల్ అసిస్టెంట్‌లో మొదట ఈ ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఇది మైక్రోఫోన్ చిహ్నం వద్ద హమ్మింగ్, ఈలలు లేదా గాత్రం ద్వారా పాటలను శోధించడానికి వినియోగదారులను అనుమతించింది. గూగుల్ పాటను గుర్తించడానికి 10 నుంచి15 సెకన్ల వ్యవధిలో హమ్మింగ్ చేయవలసి ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!