Redmi A2+: రూ. 8 వేలలో ఊహకందని ఫీచర్స్.. మార్కెట్లోకి రెడ్‌మీ ఏ2+ స్మార్ట్ ఫోన్
షియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ మార్కెట్లోకి రెడ్‌మీ ఏ2+ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. నిజానికి గడిచిన మార్చిలోనే రెడ్‌మీ ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. అయితే ఆ సమయంలో కేవలం 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను తీసుకొచ్చారు. అయితే తాజాగా విడుదల చేసిన లేటెస్ట్ వెర్షన్‌లో 4జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్స్ ప్రస్తుతం ఎంఐ ఆన్‌లైన్ స్టోరేజ్‌తో పాటు షియోమీ ఆఫ్‌లైన్...
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థలన్నీ బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. పేరుకే బడ్జెట్ ఫోన్స్ అయినా ఫీచర్స్ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా షియోమీ సబ్ బ్రాండ్ అయిన రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. రెడ్‌మీ ఏ2+ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 8వేల బడ్జెట్‌లో తీసుకురావడం విశేషం. మొత్తం రెండు వేరియంట్స్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
షియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ మార్కెట్లోకి రెడ్‌మీ ఏ2+ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. నిజానికి గడిచిన మార్చిలోనే రెడ్‌మీ ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. అయితే ఆ సమయంలో కేవలం 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను తీసుకొచ్చారు. అయితే తాజాగా విడుదల చేసిన లేటెస్ట్ వెర్షన్‌లో 4జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్స్ ప్రస్తుతం ఎంఐ ఆన్‌లైన్ స్టోరేజ్‌తో పాటు షియోమీ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్‌లోనూ ఈ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ. 7,999కాగా, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ. 8499గా ఉంది. రెడ్‌మీ ఏ2+ స్మార్ట్ ఫోన్‌లో 1600×720 పిక్సెల్స్‌తో కూడిన 6.52 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఈ డిస్‌ప్లే ప్రత్యేకత. ఇక ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ36 ఎస్వోపీ చిట్‌సెట్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అంతేకాకుండా మెమొరీ ఫ్యూజన్ అనే టెక్నాలజీ సహాయంతో ర్యామ్‌ను 3జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక రెడ్‌మీ ఏ2+లో డ్యుయల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 8 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. బండిల్డ్ చార్జర్ సపోర్ట్ ఈ ఫోన్ బ్యాటరీ ప్రత్యేకతగా చెప్పొచ్చు. స్టాండ్ బై మోడ్‌లో ఏకంగా 32 రోజులు పనిచేస్తుంది. అంతేకాదు సింగిల్ చార్జింగ్‌తో 32 గంటల కాల్ టైం వస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..