వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడాలనుకుంటున్నారా? ఈ ట్రిక్ యూజ్ చేయండి

| Edited By: Pardhasaradhi Peri

Mar 13, 2020 | 1:05 PM

వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లు ఏంటో తెలుసుకోవాలని అందరూ అనుకుంటూంటారు. దాని కోసం చాలా ప్రయత్నాలు చేసే ఉంటారు. అయితే.. ఈ టెక్నాలజీ ఐఫోన్‌లో మాత్రం అందుబాటులో...

వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడాలనుకుంటున్నారా? ఈ ట్రిక్ యూజ్ చేయండి
Follow us on

వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లు ఏంటో తెలుసుకోవాలని అందరూ అనుకుంటూంటారు. దాని కోసం చాలా ప్రయత్నాలు చేసే ఉంటారు. అయితే.. ఈ టెక్నాలజీ ఐఫోన్‌లో మాత్రం అందుబాటులో ఉంది. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది అందుబాటులో లేదు. ఈ రకమైన ఆప్షన్ ఎందుకు వచ్చిందటే.. ఎవరికైనా ఏదైనా తప్పు మెసేజ్ వెళ్లి ఉంటే.. అది ఎవరికి కనిపించకుండా, వెంటనే డిలీట్ చేయడానికి అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్ యాజమాన్యం. ఈ విధమైన టెక్నాలజీ ద్వారా సేఫ్ అవుతూ.. కొన్ని ఉపద్రువాల నుంచి తప్పించుకోవచ్చు. కానీ.. ఆ మెసేజ్ ఏంటన్నది తెలుసుకోవాలని అందరికీ ఆతృతగా ఉంటూ ఉంటుంది.

ఈ సారి ఎవరైనా.. మీకు మెసేజ్ పెట్టి ఇలా డిలీట్ చేస్తే కనుక ఈ ట్రిక్ ఉపయోగించండి. ఇకపై వాటిని తెలుసుకోవడానికి థర్డ్ పార్టీ అప్లికేషన్‌ను వాడొచ్చు. అయితే వాట్సాప్‌లో ఈ మెసేజ్‌లను చూడాటానికి ఎలాంటి సెట్టింగ్స్ ఉండవు. సపరేట్‌గా ‘సేవ్ నోటిఫికేషన్’ పేరుతో ఉండే థర్డ్ పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంటుంది.

ఇక వీటిని ఎలా చూడాలంటే.. మెసేజ్ డిలీట్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్లు ముందే థర్డ్ పార్టీ యాప్‌లో సేవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి వాట్సాప్‌లో మెసేజ్ డిలీట్ చేసినప్పటికీ.. ఆ మెసేజ్ నోటిఫికేషన్ యాప్‌‌లో సేవ్ అయి ఉంటుంది. అలా డిలీట్ అయిన మెసేజ్ ఏంటో తెలుసుకోవచ్చు.

Read More this also: రోజా ‘రచ్చబండ’కు దొరబాబు దంపతులు

షాకింగ్ న్యూస్: ఆస్ట్రేలియా క్రికెటర్‌కి కరోనా వైరస్..!