Yahoo News India: షాకింగ్ నిర్ణయం తీసుకున్న ‘యాహూ’.. భారత్‌‌లో ఇకపై ఆ సేవలు బంద్.. కారణమేంటంటే..

Yahoo News India: అంతర్జాతీయంగా ఓ వెలుగు వెలిగిన వెబ్ సర్వీస్ ప్రొవైడర్ యాహూ(Yahoo) తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో న్యూస్ సర్వీస్‌ను నిలిపివేసింది.

Yahoo News India: షాకింగ్ నిర్ణయం తీసుకున్న ‘యాహూ’.. భారత్‌‌లో ఇకపై ఆ సేవలు బంద్.. కారణమేంటంటే..
Yahoo
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 26, 2021 | 6:41 PM

Yahoo News India: అంతర్జాతీయంగా ఓ వెలుగు వెలిగిన వెబ్ సర్వీస్ ప్రొవైడర్ యాహూ(Yahoo) తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో న్యూస్ సర్వీస్‌ను నిలిపివేసింది. 20 ఏళ్లుగా భారత ప్రజలకు న్యూస్ అందించిన యాహూ నేటితో తన సేవలకు ఎండ్ కార్డ్ ప్రదర్శించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసిన యాహూ.. న్యూస్ ఆధారిత వెబ్‌సైట్ల కార్యకలాపాలను నిలిపివేసినట్లు పేర్కొంది. ఈ నిర్ణయంతో క్రికెట్, ఫైనాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్‌లు బంద్ అయ్యాయి. ఇవాళ్టి నుంచే వార్తా సేవలను నిలిపివేసిన యాహూ.. గురువారం నాడు యాహూ ఇండియాలో ఎలాంటి న్యూస్ కంటెంట్ పబ్లిష్ చేయలేదు. అయితే, మెయిల్ సర్వీసులు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని యాహూ స్పష్టం చేసింది. ‘‘ఆగష్టు 26 నుంచి యాహూ ఇండియా.. ఎలాంటి కంటెంట్‌ను పబ్లిష్‌ చేయబోదు. యాహూ అకౌంట్‌తో పాటు మెయిల్‌, సెర్చ్‌ అనుభవాలపై ఎలాంటి ప్రభావం చూపెట్టబోదు. యూజర్లు వాళ్ల అకౌంట్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదు’’ అని యాహూ ఇండియా హోం పేజీలో ప్రకటించింది.

కాగా, ఎఫ్‌డీఐ కొత్త రూల్స్‌.. విదేశీ మీడియా కంపెనీలపై భారత నియంత్రణ చట్టాల ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాహూ స్పష్టం చేసింది. డిజిటల్‌ మీడియా కంపెనీల్లో 26 శాతం వరకు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను.. అదీ కేంద్ర ప్రభుత్వం అనుమతులతోనే కొత్త చట్టాలు అనుమతించనున్నాయి. అక్టోబర్‌ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానుంది. భారత ప్రభుత్వం విధానాలు.. యాహూ క్రికెట్‌పై అధిక ప్రభావం చూపే అవకాశం ఉన్నందు యాహూ తన సేవలను ఇండియాలో నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఒకప్పుడు ఇంటర్నెట్‌కి పర్యాయపదంగా ఉన్న యాహూను.. అమెరికా టెలికం దిగ్గజం వెరిజోన్‌ 2017లో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా యాహూకు ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉండేది. చాలామంది యాహూ మెయిల్‌నే ఉపయోగించేవారు. యాహూ న్యూస్‌నే చదివేవారు. ముఖ్యంగా యాహూలో వచ్చే క్రికెట్ న్యూస్‌ను రీడర్స్ బాగా ఫాలో అయ్యేవారు. అయితే, గూగుల్ ఎంట్రీతో సీన్ అంతా మారిపోయింది. గూగుల్ ఎప్పుడైతే ఇండియాలో అడుగుపెట్టిందో.. యాహూ ప్రాభవం అప్పటి నుంచి తగ్గిపోవడం మొదలైంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్, జీమెయిల్ సర్వీస్‌లకు అంతకంతకూ ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. యావత్ ప్రపంచం చూపు గూగుల్ వైపు మళ్లింది. దాంతో యాహూ వెనక్కి వెళ్లి.. గూగుల్ ముందకు వచ్చింది. ప్రస్తుతం ఎవరికి ఏం కావాలన్నా గూగుల్‌ సెర్చ్ ఇంజిన్‌లో వెతుకుతున్నారు. యాహూ సెర్చ్ చేసేవాళ్లు పూర్తిగా తగ్గిపోయారు.

Also read:

నమ్మిన ప్రియుడు నట్టేట ముంచాడు.. అవమానంతో భర్త తనువు చాలించాడు.. ఆత్మహత్య చేసుకోబోతే బిడ్డ చనిపోయింది.. చివరికి..

మైసూరు గ్యాంగ్ రేప్ కేసు.. కర్ణాటక హోం మంత్రి వివాదాస్పద వ్యాఖ్య..ఏమన్నారంటే ..?

ఆఫ్ఘన్ నుంచి భారతీయుల తరలింపునకు అత్యంత ప్రాధాన్యం.. అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం