AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షావోమీ నుంచి దీనిని అసలు ఊహించి ఉండరు! అదేంటో తెలిస్తే నిజంగా షాకైపోతారు

Xiaomi's Mijia Smart Fish Tank 2 Pro.. ప్రముఖ టెక్ దిగ్గజం తాజాగా ఒక వినూత్న పరికరాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. చేపల పెంపకం, వాటి నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు రూపొందించిన ఈ అక్వేరియం ప్రస్తుతం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ డివైజ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

షావోమీ నుంచి దీనిని అసలు ఊహించి ఉండరు! అదేంటో తెలిస్తే నిజంగా షాకైపోతారు
Mijia Smart Fish Tank 2 Pro
Nikhil
|

Updated on: Aug 20, 2026 | 7:50 AM

Share

ఇంట్లో అక్వేరియం ఉంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ, వాటిని శుభ్రం చేయడం, సమయానికి ఆహారం పెట్టడం చాలా కష్టమైన పని. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ కంపెనీ ఒక అద్భుతమైన స్మార్ట్ సొల్యూషన్ సిద్ధం చేసింది. మరి ఆ కొత్త పరికరం విశేషాలేంటో తెలుసుకుందాం..

స్వయంగా శుభ్రం చేసుకుంటుంది..

ఈ స్మార్ట్ ఫిష్ ట్యాంక్‌లో నీటిని నిరంతరం శుభ్రం చేసేందుకు ప్రత్యేకమైన ‘మల్టీ లేయర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్’ను అమర్చారు. ఇందులో నీరు క్రమపద్ధతిలో వివిధ పొరల గుండా ప్రవహించడం ద్వారా వ్యర్థాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. దీనిలోని ‘U’ ఆకారపు బయో ఫిల్టర్ కార్ట్రిడ్జ్ మంచి బ్యాక్టీరియా వృద్ధిని పెంచి నీటిని ఎక్కువ కాలం స్వచ్ఛంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా, తక్కువ విద్యుత్ వినియోగంతో మెరుగైన నీటి ప్రవాహాన్ని అందించే శక్తివంతమైన మోటార్ ఇందులో ఉంది.

ఈ ట్యాంక్ ముందు భాగంలో 1.47 అంగుళాల కలర్ LCD స్క్రీన్‌ను అమర్చారు. దీని ద్వారా నీటి ఉష్ణోగ్రత, అక్వేరియం స్థితిగతులు, ఏవైనా వార్నింగ్స్ ఉన్నాయా అనేది వెంటనే స్క్రీన్ పై తెలుసుకోవచ్చు. ‘Mi Home’ యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా పంప్ వేగాన్ని నియంత్రించవచ్చు. అలాగే ఉష్ణోగ్రతను కూడా పర్యవేక్షించవచ్చు. ట్యాంక్ మూత తెరిస్తే ఆటోమేటిగ్గా వాటర్ పంప్ ఆగిపోయేలా దీన్ని డిజైన్ చేశారు. షావో ఐ వాయిస్ అసిస్టెంట్ సదుపాయం కూడా ఉండటం విశేషం. ఇంట్లోనే చిన్న చిన్న అక్వేరియంలను నిర్వహించే వారికి ఇది ఒక వరమని చెప్పవచ్చు.

ఆటోమేటిక్ ఫీడింగ్

ఈ ట్యాంక్‌లో మ్యాన్యువల్ మరియు స్మార్ట్ మోడ్‌లలో పనిచేసే ఆటోమేటిక్ ఫీడర్‌ను అందించారు. మీరు ఊరెళ్లినప్పుడు లేదా బిజీగా ఉన్నప్పుడు ముందుగా సెట్ చేసిన సమయానికి ఇది చేపలకు ఆహారాన్ని అందిస్తుంది. ఇందులో అత్యంత నాణ్యమైన అల్ట్రా-క్లియర్ గ్లాస్, చేపలు బయటకు దూకకుండా యాంటీ-జంప్ లిడ్, పొగమంచు పట్టకుండా సైడ్ వెంటిలేషన్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇంట్లో కరెంట్ పోయినా కూడా USB పవర్ బ్యాంక్ ద్వారా దీనిని రన్ చేయవచ్చు.

ప్రస్తుతం చైనా మార్కెట్లలో లాంచ్ అయిన ఈ అక్వేరియం ధర ప్రీ-ఆర్డర్ ఆఫర్ కింద 599 యువాన్లకు (సుమారు రూ. 8,502) లభిస్తోంది. దీని అసలు ధర 699 యువాన్లు (దాదాపు రూ. 9,922)గా ఉంది. ఆగస్టు 24 నుంచి అమ్మకాలు ప్రారంభం కానుండగా, త్వరలోనే భారత్ సహా ఇతర దేశాల్లోనూ దీనిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చేపల పెంపకంలో ఉన్న ఇబ్బందులను అధిగమిస్తూ, టెక్నాలజీని జోడించి తీసుకువచ్చిన ఈ అక్వేరియం ఆక్వా ప్రియులకు ఖచ్చితంగా ఒక గొప్ప అనుభూతిని అందిస్తుంది. ఈ సరికొత్త పరికరంతో మీ ఇంటిని మరింత అందంగా మార్చుకోవచ్చు. దీని ఫీచర్లు వింటుంటే, భవిష్యత్తులో రాబోయే హోమ్ అక్వేరియమ్స్ ఎంత ఆధునికంగా ఉండబోతున్నాయో అర్థమవుతుంది.

Follow Us