AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాము, ముంగిస మధ్య ఉన్న పగ ఏంటి? 99 శాతం మందికి తెలియని నిజం

పాము-ముంగిస పోరాటం వ్యక్తిగత పగ కాదు, ప్రకృతిలో ఆహారం, మనుగడ కోసం జరిగే సహజమైన పోటీ. ముంగిస తన చురుకుదనంతో పాము దాడులను తప్పించుకుంటూ, సరైన సమయం చూసి దాడి చేస్తుంది. విషానికి పూర్తిగా అతీతం కాకపోయినా, కొన్ని రకాల విషాలకు కొంత నిరోధకత ఉంటుంది.

పాము, ముంగిస మధ్య ఉన్న పగ ఏంటి? 99 శాతం మందికి తెలియని నిజం
Mongoose Snake
SN Pasha
|

Updated on: Jul 05, 2026 | 2:30 PM

Share

పాము కనిపించగానే ముంగిస వెంటాడి చంపేస్తుందని మనం చిన్నప్పటి నుంచే వింటూ వస్తున్నాం. సినిమాలు, జానపద కథలు కూడా ఈ రెండింటిని బద్ధ శత్రువులుగా చూపించాయి. దీంతో ముంగిసకు పాముపై వ్యక్తిగత పగ లేదా కోపం ఉంటుందని చాలామంది భావిస్తారు. అయితే వాస్తవానికి ఇది పగతో జరిగే పోరాటం కాదు. ప్రకృతిలో ఆహారం, ఆత్మరక్షణ కోసం జరిగే సహజ పోటీ మాత్రమే. ముంగిస ఒక మాంసాహార జంతువు. ఇది ఎలుకలు, బల్లులు, కప్పలు, పక్షుల గుడ్లు, చిన్న జంతువులతో పాటు అవకాశం దొరికితే పాములను కూడా ఆహారంగా తీసుకుంటుంది. మరోవైపు, పాములు కూడా చిన్న జంతువులను వేటాడుతాయి. కొన్ని విషపూరిత పాములు ముంగిస పిల్లలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అందుకే ముంగిస తన పరిసరాల్లో పాము కనిపిస్తే వెంటనే అప్రమత్తమై దానిపై దాడి చేస్తుంది.

ముంగిస పాముతో పోరాడటంలో అసాధారణ నైపుణ్యం కలిగి ఉంటుంది. దాని శరీరం అత్యంత చురుకుగా ఉండటంతో పాము చేసే వేగవంతమైన దాడులను తప్పించుకోగలదు. సరైన సమయం చూసి పాము తల లేదా మెడ భాగాన్ని బలంగా కొరికి చంపేస్తుంది. ఈ వ్యూహమే దానిని పాములకు గట్టి ప్రత్యర్థిగా నిలబెడుతుంది. చాలామంది ముంగిసకు పాము విషం ఏమాత్రం పనిచేయదని నమ్ముతారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. ముంగిస శరీరంలోని కొన్ని ప్రత్యేక జీవరసాయన లక్షణాల వల్ల కొన్ని రకాల పాముల విషానికి కొంతవరకు నిరోధకత ఉంటుంది. అయితే పెద్ద మొత్తంలో విషం శరీరంలోకి చేరితే ముంగిస కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అంటే అది పూర్తిగా విషానికి అతీతం కాదు.

వీడియో చూడండి

అలాగే ప్రతి పామును చూసి ప్రతి ముంగిస దాడి చేయదు. ఆకలి లేకపోతే లేదా ప్రమాదం అనిపించకపోతే కొన్ని సందర్భాల్లో పామును పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. అదే విధంగా పాము కూడా అవకాశం ఉంటే పోరాటాన్ని తప్పించుకుని పారిపోవడానికే ప్రయత్నిస్తుంది. అందువల్ల పాము, ముంగిస మధ్య కనిపించే పోరాటాన్ని వ్యక్తిగత శత్రుత్వంగా కాకుండా, ప్రకృతిలోని ఫుడ్ చైన్, మనుగడ కోసం జరిగే సహజ పోరాటంగా చూడాలి. ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో ఈ రెండు జీవులూ కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే వాటి మధ్య జరిగే సంఘటనలను అపోహలతో కాకుండా శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకోవడం అవసరం.

Follow Us