WhatsApp: వాట్సాప్‌ వీడియో కాల్ ఇప్పుడు మరింత స్పష్టంగా.. కొత్త అప్‌డేట్

WhatsApp: వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌ వీడియో కాల్‌లను మరింత స్పష్టంగా చేస్తుంది. లో లైట్ మోడ్ ఫీచర్‌తో తక్కువ కాంతిలో కూడా కాల్‌లో ఉన్న వ్యక్తి ముఖం స్పష్టంగా ఉంటుందని, కమ్యూనికేషన్ మరింత ప్రభావవంతంగా ఉంటుందని WhatsApp తెలిపింది..

WhatsApp: వాట్సాప్‌ వీడియో కాల్ ఇప్పుడు మరింత స్పష్టంగా.. కొత్త అప్‌డేట్
Follow us

|

Updated on: Oct 27, 2024 | 8:30 PM

వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేస్తున్నప్పుడు లైట్ అడ్జస్ట్ చేయడానికి ఇబ్బంది పడ్డారా? లేదా వీడియో స్పష్టంగా లేనందున మీరు ఇకపై వీడియో కాల్ చేయకూడదనుకున్నారా? వీడియో కాల్‌ని బట్టి కెమెరా లైట్‌ని మార్చడం గురించి చింతించకండి. వెలుతురు తక్కువగా ఉన్న ప్రదేశాల నుండి వీడియో కాల్‌లు చేయడానికి వినియోగదారులకు సహాయపడే కొత్త సాంకేతికత పరిచయం చేసింది. లో లైట్ మోడ్ అనే కొత్త ఫీచర్ ఇప్పుడు మీకు WhatsApp కాల్స్ చేయడంలో సహాయపడుతుంది.

‘లో లైట్ మోడ్’ అందుబాటులోకి రావడంతో బ్యాడ్ లైట్‌లో కూడా కాల్‌లో ఉన్న వ్యక్తి ముఖం స్పష్టంగా ఉంటుందని, కమ్యూనికేషన్ మరింత ప్రభావవంతంగా ఉంటుందని వాట్సాప్ అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: IRCTC: గుడ్‌న్యూస్‌.. మీ రైలు టికెట్‌ కన్ఫర్మ్‌ కావాలాంటే ఇలా చేయండి.. రైల్వే కొత్త స్కీమ్‌!

ఇవి కూడా చదవండి

యాప్‌లో వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఇంటర్‌ఫేస్‌లో కుడివైపు ఎగువన ఉన్న బల్బ్ ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ఈ ఫీచర్ ప్రకాశవంతంగా ఉన్నప్పుడు ఆఫ్ చేసే ఆప్షన్ కూడా ఉంది.

యాప్ iOS, Android వెర్షన్‌లలో తక్కువ-కాంతి మోడ్ అందుబాటులో ఉన్నట్లు గుర్తించింది. వీడియో కాల్ సమయంలోనే మెరుగైన అనుభవాన్ని అందించడానికి యాప్ ఇప్పటికే ఫీచర్లను ప్రవేశపెట్టింది. టచ్ అప్ ఫీచర్, ఫిల్టర్లను జోడించే ఆప్షన్, బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చుకునే ఫీచర్ తదితరాలు ఇంతకు ముందు వచ్చాయి. అలాగే వీడియో కాల్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడంతోపాటు ఫిల్టర్‌లను యాడ్ చేసుకునేందుకు ఈ కొత్త ఫీచర్‌ అవకాశం కల్పిస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలు పట్టాలపై ఇసుక ఎందుకు పోస్తారో తెలుసా?.. కారణం ఏంటంటే..

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి