WhatsApp: వావ్ అనిపించే వాట్సప్ సరికొత్త ఫీచర్..ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్‌లలో..

వినియోగదారులను ఆకట్టుకునేందుకు వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

WhatsApp: వావ్ అనిపించే వాట్సప్ సరికొత్త ఫీచర్..ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్‌లలో..
Whatsapp New Feature

Updated on: Sep 28, 2021 | 4:59 PM

WhatsApp: వినియోగదారులను ఆకట్టుకునేందుకు వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వాట్సాప్ కొత్త మల్టీ-డివైస్ సపోర్ట్ ఫీచర్‌పై పనిచేస్తోంది. ఇది వినియోగదారులు రెండు స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించడానికి అవకాశం ఇస్తుంది. వాబెటాఇన్‌ఫో వెల్లడించిన వివరాల ప్రకారం.. వాట్సప్(WhatsApp) రాబోయే ఈ సరికొత్త ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది. ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, వినియోగదారులు రెండు మొబైల్ పరికరాల్లో వాట్సాప్‌ను ఉపయోగించగలరని పేర్కొంది. ప్రస్తుతం, వాట్సాప్ మల్టీ-డివైజ్ ఫీచర్ ఒక వాట్సాప్ ఖాతాను 4 డివైజ్‌లు.. 1 ఫోన్‌కి లింక్ చేయడానికి అనుమతిస్తుంది. మల్టీ-డివైజ్ ఫీచర్ ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సాప్ వినియోగదారులందరికీ ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. బీటా యూజర్ల ప్రయోగ పరిశీలనలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుంది?

ఒక యూజర్ మొదటిసారి తమ వాట్సాప్ ఖాతాకు రెండవ మొబైల్ పరికరాన్ని లింక్ చేసినప్పుడు, వాట్సప్ (WhatsApp) చాట్ హిస్టరీని సింక్ చేస్తుంది. ఈ ప్రక్రియ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసి ఉంటుందని వాబెటాఇన్‌ఫో వెల్లడించింది.
తదుపరిసారి ఒక వినియోగదారు రెండవ మొబైల్ పరికరంలో వాట్సప్(WhatsApp) తెరిచినప్పుడు, వాట్సప్ సర్వర్ నుండి అన్ని సందేశాలను డౌన్‌లోడ్ చేస్తుంది. దీనికి మీ ప్రధాన ఫోన్‌ను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయవలసిన అవసరం లేదు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఫీచర్, టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల కోసం అందుబాటులో ఉండే అవకాశం ఉంది. “వాట్సప్ ఈ ఫీచర్‌ను టాబ్లెట్‌ల కోసం మాత్రమే రిజర్వు చేస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు (ఐప్యాడ్,ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ల కోసం వాట్సాప్ ) అయితే, అవి మొబైల్ ఫోన్‌లను మినహాయించే ఆధారాలు లేవు” అని వాబెటాఇన్‌ఫో నివేదిక పేర్కొంది.

ఫీచర్ ఎప్పుడు విడుదల అవుతుంది?

ప్రస్తుతం, iOS కోసం WhatsApp బీటాలో ఈ ఫీచర్ అభివృద్ధిలో ఉంది. ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్ ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ కోసం కూడా పనిచేస్తోందని నివేదిక చెబుతోంది. త్వరలోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆ నివేదిక అంచనా వేసింది.

కాగా, వాట్సప్ వినియోగదారుల సౌలభ్యం కోసం వాయిస్ మెసేజ్‌ల ప్లేబ్యాక్ వేగాన్ని ఛేంజ్ చేసుకునే ఫీచర్‌పై పనిచేస్తున్నట్లు వాట్సప్ ఇటీవల ప్రకటించింది. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం వాట్సప్‌ బీటాలో ప్రయోగదశలో ఉంది. ఇప్పుడు ఐఓఎస్ యూజర్ల కోసం ప్రస్తుతం డెవలప్ చేస్తున్నారు. ఈ ఫీచర్‌తో వాట్సప్ యూజర్లు వాయిస్ నోట్స్‌ని స్పీడ్‌ మోషన్‌లో వినడానికి వీలు ఉంటుంది. ఈ ఫీచర్ వాట్సప్ వెర్షన్ 2.21.60.11 తో విడుదల అవుతుంది. ఇది మొత్తం 1x, 1.5x, 2x. మూడు దశల స్పీడ్ స్థాయిలను కలిగి ఉంటుంది. యూజర్లు ఈ వేగాలలో ఏదైనా ఆడియో సందేశాలను ప్లే చేయగలుగుతారు.

Also Read: Viral News: ‘ఎనర్జీ డ్రింక్స్’ తాగిన కొద్ది గంటల్లోనే స్పృహ తప్పింది.. తీరా స్కాన్ చేసి చూడగా గట్టి షాక్!

Punjab Politics: ఢిల్లీకి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. బీజేపీతో జట్టు కట్టడానికేనా?