AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సప్ నుంచి మరో కీలక అప్డేట్.. ఇక నుంచి వారికి కూడా..

ఇప్పటివరకు ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులో ఉన్న మల్టీ అకౌంట్ సపోర్ట్ ఫీచర్.. త్వరలో ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. ఐఫోన్ యూజర్ల కోసం వాట్సప్ ఈ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. అతి త్వరలోనే ఈ ఫీచర్ ఐఫోన్లలో అప్‌డేట్ కానుందని తెలుస్తోంది.

WhatsApp: వాట్సప్ నుంచి మరో కీలక అప్డేట్.. ఇక నుంచి వారికి కూడా..
Whatsapp Mobile App
Venkatrao Lella
|

Updated on: Nov 20, 2025 | 11:54 AM

Share

WhatsApp accounts: సైబర్ మోసాలు పెరుగుతుండటం, సైబర్ నేరగాళ్లు వినూత్న పద్దతుల్లో బురిడీ కొట్టిస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ కోసం ఇటీవల ఎక్కువమంది ఐఫోన్ వాడుతున్నారు. దీంతో ఐఫోన్ విక్రయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు స్పామ్ లింక్‌లు పంపించి ఆండ్రాయిడ్ ఫోన్లను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులను కొల్లగొడుతున్నారు. అలాగే విలువైన సమాచారాన్ని దొంగలిస్తున్నారు. ఐఫోన్‌ను హ్యాక్ చేయడం కష్టతరమైన పని గనుక ఎక్కువమంది వాటివైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉన్న చాలా ఫీచర్లు ఐఫోన్లలో అందుబాటులో ఉండవు. దీంతో ఆండ్రాయడ్ ఫోన్లలో ఉండే చాలా ఫీచర్లను ఐఫోన్ యూజర్లకి కూడా అందుబాటులోకి తెస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ప్రముఖ సోషల్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే వాట్సప్ మల్టీ అకౌంట్ సపోర్ట్‌ను ఐఫోన్లలో కూడా ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సప్ టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఐఫోన్ యూజర్లు కూడా వాట్సప్‌లో ఒకేసారి రెండు అకౌంట్లను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం చాలామంది వాట్సప్‌లో రెండు అకౌంట్లను ఉపయోగిస్తున్నారు. ఒకటి వ్యక్తిగత పనుల కోసం ఉపయోగిస్తుండగా.. మరొకటి ప్రొఫెషనల్ అవసరాలు లేదా బిజినెస్ కోసం వినియోగిస్తున్నారు. ఐఫోన్ యూజర్లకు ఇప్పటివరకు వాట్సప్‌లో మల్టీ అకౌంట్ ఆప్షన్ అందుబాటులో లేదు. ద

అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి..?

-ఐఫోన్ యూజర్లు వాట్సప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ లిస్ట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి

-ఆ తర్వాత అక్కడ మరో నెంబర్ ఇచ్చి వాట్సప్ అకౌంట్ యాడ్ చేయవచ్చు

-దీని ద్వారా ఒకే వాట్సప్ యాప్‌లో రెండు అకౌంట్లను యూజ్ చేసుకోవచ్చు

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!