Whatsapp: వాట్సాప్‌ యూజర్లకు అదిరిపోయే ఫీచర్‌.. ఇకపై వీడియో కాల్స్‌ మరింత మెరుగ్గా..

|

Sep 30, 2022 | 7:42 AM

యూజర్ల అవరసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌కు ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్లను ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో మొదటి స్థానం వాట్సాప్‌దే...

Whatsapp: వాట్సాప్‌ యూజర్లకు అదిరిపోయే ఫీచర్‌.. ఇకపై వీడియో కాల్స్‌ మరింత మెరుగ్గా..
Whatsapp Video Call
Follow us on

యూజర్ల అవరసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌కు ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్లను ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో మొదటి స్థానం వాట్సాప్‌దే. ఇందులో ఉండే ఫీచర్లే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఎన్నో రకాల మెసేజింగ్‌ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా వాట్సాప్‌ క్రేజ్‌ మాత్రం తగ్గడం లేదు. ప్రత్యర్థి కంపెనీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుంటూ కొంగొత్త ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్‌ చేస్తోంది.

ఈ క్రమంలోనే వాట్సాప్‌ తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌ను యూజర్లకు అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీడియో కాలింగ్‌ కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌తో కాల్స్ ట్యాబ్‌లో కొత్తగా ‘కాల్ లింక్‌లు’ ఆప్షన్ అందిస్తున్నట్లు తెలపింది. ‘కాల్ లింక్‌లు’ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా వినియోగదారులు కాల్స్ ట్యాబ్‌ కింద వీడియో లింక్‌ వస్తుంది. ఈ లింక్‌ను ఇతరులకు సెండ్ చేయెచ్చు. డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేస్తే ఆడియో/వీడియో కాల్స్‌లో జాయిన్ కావచ్చు. ప్రస్తుతం గూగుల్ మీట్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌లో ఉన్న ఫీచర్లను పోలి ఉంటుంది.

ఇదిలా ఉంటే వాట్సాప్‌ గ్రూప్‌ కాలింగ్‌లో ప్రస్తుతం ఒకేసారి కేవలం 8 మంది మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ సంఖ్యను పెంచేందుకు వాట్సాప్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూప్‌ వీడియో కాల్‌లో ఒకేసారి 32 మంది పాల్గొనే ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..