Whatsapp New Feature: వాట్సాప్‌ నుంచి మరో ఇంటరెస్టింగ్ ఫీచర్.. ఒకేసారి 50 మందితో వీడియో కాల్..!

|

Mar 17, 2021 | 6:53 AM

Whatsapp New Feature: తన వినియోగదారుల కోసం వాట్సాప్‌ సరికొత్త ఫీచర్స్‌ తీసుకురావడంపై దృష్టి సారించింది. అందులో భాగంగానే 2021లో...

Whatsapp New Feature: వాట్సాప్‌ నుంచి మరో ఇంటరెస్టింగ్ ఫీచర్.. ఒకేసారి 50 మందితో వీడియో కాల్..!
Whatsapp
Follow us on

Whatsapp New Feature: తన వినియోగదారుల కోసం వాట్సాప్‌ సరికొత్త ఫీచర్స్‌ తీసుకురావడంపై దృష్టి సారించింది. అందులో భాగంగానే 2020లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే సుమారు పదికి పైనే కొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. అలానే కొత్త సంవత్సరంలో కూడా యూజర్స్‌కి మెరుగైన సేవలు అందించేందుకు మరికొన్ని కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే మెసేజింగ్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీ చేసేలా మరో అద్భుత ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ‘మెసెంజర్ రూమ్’. ఈ ఫీచర్ ద్వారా ఒకేసారి 50 మందికి గ్రూప్ వీడియో కాల్ చేయవచ్చు.

ఓ యూజర్ మెసెంజర్ యాప్ లేదా మొబైల్ లేదా వెబ్ బ్రౌజర్‌‌లో మెసెంజర్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఎక్కువ మందితో వీడియో చాట్ చేసేందుకు రూమ్ క్రియేట్ చేయవచ్చు. ఇక ఆ తర్వాత యూజర్లు వాట్సాప్‌లోని తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీకు గ్రూప్ వీడియో చాట్‌ చేసేందుకు లింక్ ద్వారా ఆహ్వానం పంపించవచ్చు. అందువల్ల వారంతా కూడా ఫేస్‌బుక్ ఖాతా లేదా మెసెంజర్ యాప్ లేకుండానే ఈ చాట్ రూమ్స్‌లలో చేరే అవకాశం ఉంటుంది.

‘మెసెంజర్ రూమ్’ లింక్ క్రియేట్ చేసి షేర్ చేయండిలా…

  • ముందుగా వాట్సాప్ వెబ్ లేదా మెసెంజర్ డెస్క్‌టాప్‌ వెర్షన్‌ను ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత Individual Chat మెనూకు వెళ్లి వీడియో కాల్ ఆప్షన్ క్లిక్ చేయండి.
  • ఇక స్క్రీన్‌పై ఉన్న అటాచ్‌మెంట్స్ ఐకాన్‌ నొక్కండి.
  • ఆపై ‘రూమ్స్’ ఆప్షన్‌ను ఎంపిక చేయండి.
  • ఆ తర్వాత ‘కంటిన్యూ ఇన్ మెసెంజర్‌’ ఆప్షన్ క్లిక్ చేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

హోమ్‌లోన్ తీసుకుంటున్నారా.! అయితే ఈ విషయాలను తప్పక గుర్తించుకోండి.. లేదంటే.!