WhatsApp: వాట్సాప్ యూజర్లకు ఇక పండగే.. ఒకే ఖాతాకు నాలుగు డివైజ్‌లను లింక్ చేసే అవకాశం..

|

May 26, 2024 | 2:19 PM

మల్టీ డివైస్ సపోర్టు ఫీచర్ ను ఉపయోగించుకుని మన వాట్సాప్ ఖాతాను నాలుగు డివైస్ లు అంటే నాలుగు పరికరాలకు లింక్ చేసుకోవచ్చు. కంపానియన్ మోడ్‌తో ఇది సాధ్యమవుతుంది. ఇంతకుముందు రెండు వేర్వేరు ఫోన్లలో వాట్సాప్ అప్లికేషన్‌ను ఉపయోగించాలనుకుంటే, రెండు వేర్వేరు నంబర్లను తీసుకోవాలనే నిబంధన ఉండేది. కానీ 2024 లో మార్పు తీసుకు వచ్చారు.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు ఇక పండగే.. ఒకే ఖాతాకు నాలుగు డివైజ్‌లను లింక్ చేసే అవకాశం..
Whatsapp Multi Device Support
Follow us on

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు తరచూ అనేక అప్ డేట్ లు చేస్తూ ఉంటుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, లేటెస్ట్ ఫీచర్లను ఎప్పటికప్పుడు మార్పు చేస్తూ ఉంటుంది. వాటితో మరింత సులభంగా, సౌకర్యవంతంగా యాప్ ను ఉపయోగించుకునే వీలుంటుంది. ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్. దీనికి పెద్దసంఖ్యలో యూజర్లు ఉన్నారు. సమాచారం, చిత్రాలు, డాక్యుమెంట్లు .. ఇలా ప్రతీదీ వాట్సాప్ లో ఒకరి నుంచి మరొకరికి బదిలీ అవుతూ ఉంటాయి. ప్రజల నుంచి ఇంత ఆదరణ పొందిన ఈ యాప్ కూడా తన పనితీరు, సామర్థ్యం పెంచుకుంటూ ముందుకు సాగుతోంది.

తరచూ అప్ డేట్ లు..

వాట్సాప్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన రోజు నుంచి తనకు తానుగా అప్‌డేట్ అవుతూనే ఉంది. ఈ యాప్ ను ప్రజలు ఉపయోగించడానికి గల కారణాలలో ఇది ప్రధానమైనది. దీనిలో ప్రతిసారీ కొత్త ఫీచర్ల యాడ్ అవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా కొత్త పీచర్లను పరిచయం చేసింది. ఈ కొత్త అప్‌డేట్‌లలో మల్టిపుల్ అకౌంట్ సపోర్టు, మల్టి డివైస్ సపోర్టు, పిన్ చేసిన సందేశాలు, లాక్ స్క్రీన్ నుంచి రిప్లయ్ ఇవ్వడం, పోల్స్, క్విజ్‌లు, స్క్రీన్ షేర్ తదితర ఫీచర్ల ఉన్నాయి. వీటిలో మల్టీ డివైజ్ సపోర్టు (బహుళ పరికరాల మద్దతు) గురించి వివరంగా తెలుసుకుందాం.

కంపానియన్ మోడ్..

మల్టీ డివైస్ సపోర్టు ఫీచర్ ను ఉపయోగించుకుని మన వాట్సాప్ ఖాతాను నాలుగు డివైస్ లు అంటే నాలుగు పరికరాలకు లింక్ చేసుకోవచ్చు. కంపానియన్ మోడ్‌తో ఇది సాధ్యమవుతుంది. ఇంతకుముందు రెండు వేర్వేరు ఫోన్లలో వాట్సాప్ అప్లికేషన్‌ను ఉపయోగించాలనుకుంటే, రెండు వేర్వేరు నంబర్లను తీసుకోవాలనే నిబంధన ఉండేది. కానీ 2024 లో మార్పు తీసుకు వచ్చారు.

ఎంతో ప్రయోజనం..

కొత్త ఫీచర్ లో ఒకే వాట్సాప్ ఖాతాను వివిధ ఫోన్లలో ఉపయోగించుకోవచ్చు. దీనిని కంపానియన్ మోడ్ అని కూడా పిలుస్తారు. మీ ప్రాథమిక ఫోన్‌ను ఉపయోగించి నాలుగు వేర్వేరు పరికరాలను లింక్ చేయడానికి అప్లికేషన్ మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే నాలుగు పరికరాలు కొనసాగాలంటే ప్రతి 14 రోజులకు మీ ప్రాథమిక ఫోన్‌కు లాగిన్ అవుతూ ఉండాలి. మీరు నాలుగు పరికరాలను ఏవైనా ఎంచుకోవచ్చు, నాలుగు వేర్వేరు కంప్యూటర్లు, లేదా నాలుగు వేర్వేరు ఫోన్లను ఎంపిక చేసుకునే వీలుంది. అయితే డెస్క్‌టాప్, ఫోన్ల ను లింక్ చేసే విధానాలు ఒకదానికి మరొకటి భిన్నంగా ఉంటాయి.

ఇలా చేయండి..

వాట్సాప్ యాప్ స్క్రీన్ కుడి ఎగువ మూలలో మూడు చుక్కలు ఉంటాయి. వాటిపై క్లిక్ చేస్తే, డ్రాప్ డౌన్ తెరుచుకుంటుంది. అక్కడ లింక్ డివైజ్ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతర క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. దీంతో మీ పని పూర్తవుతుంది. అనంతరం నాలుగు డివైజ్ లలో వాట్సాప్ యాప్ ను అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రాథమిక ఫోన్ ను 14 రోజులకు పైగా ఉపయోగించుకుంటే మిగిలిన పరికరాలు లాగ్ అవుట్ అవుతాయి. అంటే మల్టీ డివైజ్ పనిచేయాలంటే ప్రాథమిక ఫోన్ లో యాప్ ను తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉండాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..