
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ ఏంటి అంటే టక్కున చెప్పే సమాధానం వాట్సాప్. అంతలా క్రేజ్ సంపాదించుకుందీ యాప్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ మెసేజింగ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. టెక్ మార్కెట్లో ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చినా వాట్సాప్ క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. దీనికి ప్రధాన కారణం ఎప్పటికప్పుడు వాట్సాప్ అప్‌కావడమే.
మారుతోన్న కాలానికి, టెక్నాలజీకి యూజర్ల అభి రుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూనే ఉంది కాబట్టే ఎన్ని రకాల యాప్స్ వచ్చినా వాట్సాప్ క్రేజ్ తగ్గలేదు. ముఖ్యంగా యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ వాట్సాప్ నిత్యం ఏదో ఒక ఫీచర్‌ను జోడిస్తూనే ఉంది. ఇలా కొంగొత్త ఫీచర్స్‌ను జోడించే క్రమంలో వాట్సాప్ యాప్‌ను సైతం అప్‌డేట్ చేస్తూ వస్తోంది. దీంతో సహజంగానే పాత ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో పనిచేసే ఫోన్స్‌లో వాట్సాప్ తన సేవలను నిలిపివేస్తుంది.
ఇలా ఇప్పటి వరకు చాలా సార్లు వాట్సాప్ తన సేవలను పలు ఫోన్‌లకు నిలిపివేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని డివైజ్‌లలో వాట్సాప్ తన సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఫోన్లకు తన సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. అక్టోబర్ 24వ తేదీ నుంచి ఈ రూల్ అమల్లోకి రానుందని వాట్సాప్ అధికారికంగా ప్రకటించింది.
ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు అంతకంటే తక్కువ వెర్షన్‌తో పని చేస్తున్న ఫోన్‌లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు. అయితే ఈ లిస్ట్‌లో ఉన్న కొన్ని ఫోన్‌లు ప్రస్తుతం మార్కెట్లో పెద్దగా ఉపయోగంలో లేవు, కానీ ఒకవేళ ఎవరైనా ఆ ఫోన్‌లను ఉపయోగిస్తుంటే వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నట్లు తెలిపింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 5.0, ఐఫోన్ 12 ఫోన్‌లలో వాట్సాప్ సేవలు కొనసాగనున్నాయి.
అక్టోబర్ 24 నుంచి వాట్సాప్ పనిచేయని స్మార్ట్ ఫోన్స్ జాబితాలో నెక్సస్ 7, సామ్‌సంగ్ గ్యాలక్సీ నోట్2, హెచ్‌టీసీ వన్, సోనీ ఎక్స్‌పీరియా జడ్, ఎల్‌జీ ఆప్టిమస్ జీ ప్రో, సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్2, సామ్‌సంగ్ గ్యాలక్సీ నెక్సస్, హెచ్‌టీసీ సెన్సేషన్, మోటోరోలా డ్రాయిడ్ రేజర్, సోనీ ఎక్స్‌పీరియా ఎస్2, మోటోరోలా జూమ్, సామ్‌సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ 10.1, ఆసుస్ ఈ ప్యాడ్ ట్రాన్స్ ఫార్మర్, ఏసర్ ఐసోనియా ట్యాబ్ ఏ 5003, సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్, హెచ్‌టీసీ డిజైర్ హెచ్‌డీ, ఎల్‌జీ ఆప్టిమస్ 2 ఎక్స్, సోనీ ఎరిక్స్ ఎక్స్‌పీరియా ఆర్క్ 3 ఫోన్‌లు ఉన్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..