WhatsApp: అదిరే అప్‌డేట్ ఇచ్చిన వాట్సాప్.. మూడు సరికొత్త ఫీచర్లు.. వివరాలు ఇవి..

|

May 07, 2023 | 2:39 PM

మరో లేటెస్ట్‌ అప్‌డేట్‌ ను వాట్సాప్‌ వినియోగదారులకు అందిస్తోంది. దీనిలో మూడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. వినియోగదారులను అభిప్రాయాలను అడగడానికి, ఫీడ్‌బ్యాక్‌ సేకరించడానికి తీసుకొచ్చిన పోలింగ్‌ ఫీచర్‌కి ఓ మరిన్ని కొత్త ఫీచర్లు యాడ్ చేసింది.

WhatsApp: అదిరే అప్‌డేట్ ఇచ్చిన వాట్సాప్.. మూడు సరికొత్త ఫీచర్లు.. వివరాలు ఇవి..
Whatsapp
Follow us on

చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉందంటే.. దానిలో వాట్సాప్‌ ఉండి తీరాల్సిందే! అంతలా వాట్సాప్‌ జనాలతో కనెక్ట్‌ అయిపోయింది. సమాచార మార్పిడికి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ రిలేషన్స్‌ మెయింటేన్‌ చేసేందుకు వాట్సాప్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా నిలుస్తోంది. అదే స్థాయిలో వినియోగదారులకు మంచి అనుభవాన్ని ఇచ్చేందుకు మెటా యాజమాన్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు యూజర్‌ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకొని, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సరికొత్త ఫీచర్లు, అప్‌డేట్లు అందిస్తోంది. ఇదే క్రమంలో మరో లేటెస్ట్‌ అప్‌డేట్‌ ను వాట్సాప్‌ వినియోగదారులకు అందిస్తోంది. దీనిలో మూడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. వినియోగదారులను అభిప్రాయాలను అడగడానికి, ఫీడ్‌బ్యాక్‌ సేకరించడానికి తీసుకొచ్చిన పోలింగ్‌ ఫీచర్‌కి ఓ మరో కొత్త ఫీచర్లు యాడ్ చేసి అప్‌డేట్‌ అందించింది. అదే విధంగా మెసేజ్‌లు, డాక్యుమెంట్లను క్యాప్షన్‌తో ఫార్వాడ్‌ చేసే సదుపాయం తీసుకొచ్చింది.

పోలింగ్‌ ఫీచర్‌ ఇలా..

వాట్సాప్‌ 2022 నవంబర్‌లోనే పోలింగ్ ఫీచర్‌ని లాంచ్‌ చేసింది. ఇప్పుడు ఈ ఫీచర్‌కి లేటెస్ట్‌ అప్‌డేట్‌లను తీసుకొచ్చింది. ఏదైనా అంశంపై ఇతరుల అభిప్రాయం తెలుసుకునేందుకు వీలుగా వాట్సాప్‌ పోల్స్‌ ఫీచర్‌ను పరిచయం చేసింది. కొత్తగా ఇందులో మూడు అప్‌ డేట్‌ లను తీసుకొచ్చింది. క్రియేట్‌ సింగిల్‌ ఓట్‌ పోల్‌, సెర్చ్‌ ఫర్‌ పోల్స్‌ ఇన్‌ చాట్స్‌, పోల్‌ రిజల్ట్‌ అప్‌ డేట్.

  • ప్రస్తుతం వాట్సాప్‌ పోల్స్‌ లో యూజర్లు ఒకటి కన్నా ఎక్కువసార్లు తమకు నచ్చిన ఆప్షన్‌కు ఓటు వేయవచ్చు. దీని వల్ల పోల్స్‌ ఫలితాల్లో సరైన పారదర్శకత ఉండటం లేదని చాలా మంది యూజర్లు అభిప్రాయపడుతున్నారు. దీనికి పరిష్కారంగానే వాట్సాప్‌ క్రియేట్‌ సింగిల్‌ ఓట్‌ పోల్‌ ఆప్షన్‌ తీసుకొచ్చింది. దీంతో పోల్‌ లో పాల్గొనే వారు ఒక్కసారి మాత్రమే ఓటు వేయగలరు
  • ఏదైనా గ్రూప్‌ లో పోల్‌ నిర్వహించినప్పుడు తర్వాత ఓటు వేద్దామని మర్చిపోతాం. తర్వాత గ్రూప్‌ లో వచ్చిన మెసేజ్‌లతో పోల్‌ ఎక్కడ ఉందనేది కనిపించదు. ఇలాంటి సందర్భంలో పోల్‌ను సులువుగా గుర్తించేందుకు చాట్‌ పేజీలో సెర్చ్‌ చేయచ్చు. గ్రూప్‌ లేదా వ్యక్తిగత చాట్‌ పేజీలో సెర్చ్‌ ఆప్షనలోకి వెళ్లి పోల్‌స్‌ అని టైప్‌ చేస్తే మొత్తం పోల్స్‌ జాబితా చూపిస్తుంది.
  • పోల్‌ రిజల్ట్‌ అప్‌డేట్‌ ఫీచర్‌తో యూజర్లు తాము నిర్వహించే పోల్స్‌లో ఎవరైనా ఓటు వేసిన వెంటనే నోటిఫికేషన్‌ వస్తుంది. దీనివ ల్ల ఎప్పుడు? ఎవరెవరు ఓటు వేశారనేది సులువగా తెలుసుకోవచ్చు.

ఫైల్స్‌ షేరింగ్‌కి కొత్త ఆప్షన్స్‌..

యూజర్లు ఈజీగా ఇన్‌ఫర్మేషన్‌ షేర్‌ చేయడానికి, కమ్యూనికేట్‌ కావడానికి వీలుగా వాట్సాప్‌ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను క్యాప్షన్‌లతో ఫార్వార్డ్ చేసే అవకాశం కల్పించింది. కాంటాక్ట్స్‌తో మీడియాను షేర్‌ చేసేటప్పుడు ఈ ఫీచర్ మరింత వివరణ అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఫొటో విత్‌ క్యాప్షన్‌.. గతంలో ఇతరులు పంపిన లేదా గ్రూప్‌ లో వచ్చిన ఫొటోలను మరొకరితో షేర్‌ చేసేటప్పుడు ఇమేజ్‌ మాత్రమే ఫార్వార్డ్‌ చేయగలిగే వాళ్లం. దాంతోపాటు ఉన్న టెక్ట్స్‌ను వేరేగా కాపీ చేసి పేస్ట్‌ చేయాల్సిందే. కానీ ఫార్వాడింగ్‌ విత్‌ క్యాప్షన్స్‌ ఫీచర్‌తో ఇతరులు పంపిన ఫొటోతో పాటు దాని కింద ఉన్న క్యాప్షన్‌ కూడా ఫార్వార్డ్‌ అవుతుంది.

డాక్యుమెంట్‌ విత్‌ క్యాప్షన్‌.. షేరింగ్‌ డాక్యుమెంట్‌ విత్‌ క్యాప్షన్స్‌తో యూజర్లు ఏదైనా డాక్యుమెంట్‌ ను ఇతరులుకు షేర్‌ చేసేటప్పుడు దాని గురించిన సమాచారం క్లుప్తంగా పంపవచ్చు.అంటే ఫొటో విత్‌ క్యాప్షన్‌ తరహాలోనే యూజర్‌ అటాచ్‌ ఫైల్‌ ఆప్షన్‌ ద్వారా ఏదైనా డాక్యుమెంట్‌ పంపుతుంటే.. అందులోని సమాచారం గురించి వివరిస్తూ టెక్ట్స్‌ యాడ్‌ చేయొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..