లారీల వెనుక ‘Horn Ok Please’ అని ఎందుకు ఉంటుందో తెలుసా?

|

Oct 08, 2024 | 12:57 PM

మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడో ఇతర వాహనాలను గమనించే ఉంటారు. ఆటోలు, టాక్సీలు, లారీలు ఇలా వాహనాల వెనుక భాగంపై ఓ కొటేషన్లు రాసి ఉంటాయి. అదే ‘Horn OK please’. అయితే వాహనం వెనుక ఇలా రాయాలనే నిబంధన ఏమి లేదు. ప్రభుత్వ నిబంధన కూడా లేదు...

లారీల వెనుక Horn Ok Please అని ఎందుకు ఉంటుందో తెలుసా?
Follow us on

మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడో ఇతర వాహనాలను గమనించే ఉంటారు. ఆటోలు, టాక్సీలు, లారీలు ఇలా వాహనాల వెనుక భాగంపై ఓ కొటేషన్లు రాసి ఉంటాయి. అదే ‘Horn OK please’. అయితే వాహనం వెనుక ఇలా రాయాలనే నిబంధన ఏమి లేదు. ప్రభుత్వ నిబంధన కూడా లేదు. మరి ఇలా ఎలాంటి నిబంధనలు లేకున్నా ఈ పదాలను ఎందుకు వాడరో తెలియదు కానీ.. ఇలా ఎందుకు రాస్తారో ఓ ప్రత్యేక కారణం ఉందంటున్నారు నిపుణులు.

Ok అనే పదానికి అర్థం.. 1939 నుంచి 45 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ సమయంలో డీజిల్ కొతర బాగా ఏర్పడింది. దీంతో ప్రజలు తమ అవసరాలకోసం ఎక్కువగా కిరోసిన్‌పై ఆధారపడటం మొదలు పెట్టారు. చివరికి వాహనాలకు ఇంధనంగా కూడా డీజిల్‌కు బదులు దానిని ఉపయోగించారు. రెండో ప్రపంచ యుద్ధం కాలంలో ట్రక్‌ డ్రైవర్లు వాహనాలకు డీజిల్‌కు బదులుగా కిరోసాన్‌ వాడేవారట. డీజిల్‌ ఖర్చు తగ్గుతుందని ఇలా కిరోసిన్‌ను వాడేవారు. డీజిల్‌ కంటే కరోసిన్‌కు మండే స్వభావం ఉంటుంది. అందుకే వాహనం నడుపుతున్నట్లయితే ఆ వాహనం వెనుక OK రాసి ఉంటుంది. ఇక్కడ ఓకే అంటే ఆన్‌ కిరోసిన్‌ (On Kerosene) అని అర్థం. ఈ పదం కనిపించగానే వెనుకన్న వాహనాలు మరీ దగ్గరకు రాకుండా జాగ్రత్త పడేవారట డ్రైవర్లు. కిరోసాన్‌ వాహనం కదా అని మరీ దగ్గరకు రాకుండా కొంత డిస్టాన్స్‌ పాటించేవారు. దీని వల్ల కరోసిన్‌ వల్ల ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా వెనుకున్న వాహనంకు ప్రమాదం కలుగకుండా ఉండేందుకు ఈ OK పదాన్ని రాసేవారట.

ఈ హార్న్‌ ఓకే ప్లీజ్‌ అనే పదాలు చూసిన వాహనదారులు అనవసరమైన హారన్‌ ఉపయోగించి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నారనిక సెక్షన్‌ 134 (1) వాహన చట్టం కింద 2015 ఏప్రిల్‌ 30న మహారాష్ట్ర సర్కార్‌ వాహనాలపై Horn Ok Please అనే పదాలను బ్యాన్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

దీనికి మరో అర్థం కూడా ఉంది. ట్రక్‌ రోడ్డుపై వెళ్తున్నప్పుడు దానిని ఎవరైనా ఓవర్‌ టెక్‌ చేయాలి అనుకుంటే ముందుగా హారన్‌ కొడతారు. దీంతో ముందు వాహనం నడిపే ట్రక్‌ డ్రైవర్‌ తన వెనుక మరో భారీ వాహనం వస్తోందని గమనించి వాళ్లు ఓవర్‌టెక్‌ చేయ్యాలనే ఉద్దేశంతో హారన్‌ కొట్టారని అర్థం చేసుకుంటారు. వెనుక వాహనానికి ముందున్న వాహన డ్రైవర్‌ దారి ఇస్తాడు. దీంతో వెనుకున్న వాహనదారుడు ఓవర్‌ టెక్‌ చేసి ముందుకెళ్తాడు.

కొన్ని ప్రాంతాల్లో సింగిల్‌ రోడ్డు ఉండటం వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి రోడ్లలో చిన్న వాహనాలు మాత్రమే నడుస్తుంటాయి. కానీ కొన్ని సమయాల్లో ముందున్న పెద్ద వాహనం లాంటి లారీ ఉంటే ఓవర్‌ టెక్‌ చేయడానికి వీలుండదు. రోడ్డులో ఎదురుగా ఏ వాహనం వస్తుందో తెలిసేది కాదు. పెద్ద వాహనాన్ని దాటేందుకు వెనుకున్న వాహనదారులు హారన్‌ కొట్టగానే ముందున్న వాహనంలోని డ్రైవర్‌ OK అని అర్థం వచ్చేలా ఓ వైట్‌ కలర్‌ బల్బును వెలిగించేవారు. ఆ బల్బు వెలిగితే ఓవర్‌ టెక్‌ చేసుకోవచ్చని అర్థం.

(గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడం జరిగింది. వీటిని టీవీ9 ధృవీకరించడం లేదు.)

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి